Asianet News TeluguAsianet News Telugu

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దు: కూసుకుంట్లను అభినందించిన కేసీఆర్


సీఎం కేసీఆర్ ను మునుగోడు ఎమ్మెల్యే  కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డి  సోమవారంనాడు  ప్రగతి భవన్ లో కలిశారు.కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డిని సీఎం అభినందించారు.

Munugode MLA  Kusukuntla Prabhakar  Reddy Meets Telangana  CM KCR
Author
First Published Nov 7, 2022, 7:52 PM IST

హైదరాబాద్: తెలంగాణ  సీఎం కేసీఆర్ ను మునుగోడు ఎమ్మెల్యే  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహా  ఉమ్మడి నల్గొండ  జిల్లాకు  చెందిన టీఆర్ఎస్ నేతలు  సోమవారంనాడు కేసీఆర్ ను కలిశారు. 

మునుగోడు ఉప ఎన్నిక  ఫలితం నిన్ననే  వచ్చింది. మునుగోడు  ఉపఎన్నికలో  టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ స్థానం నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప బీజేపీ  అభ్యర్ధి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విజయం  సాధించారు.  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితోపాటు   జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు సీఎం  కేసీఆర్ న కలిశారు.మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్  అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు. మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని  ఆయన సూచించారు.ప్రజల నమ్మకాన్ని వమ్ము  చేయవద్దని ఆయన  సూచించారు.విజయం  కోసం పనిచేసిన పార్టీ  నేతలను, కార్యకర్తలను కేసీఆర్  అభినందించారు.

మునుగోడు అసెంబ్లీ  నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ 86  యూనిట్లుగా విభజించింది. ఒక్కో నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,ఎంపీ,మంత్రి,కీలక నేతలను ఇంచార్జీగా  నియమించింది.మునుగోడు  ఉప ఎన్నికను టీఆర్ఎస్ ,బీజేపీ ప్రతిష్టాత్మకంగా  తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో  విజయం  కోసం ఈ  రెండు పార్టీలు తమ  సర్వశక్తులు ఒడ్డాయి. కానీఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.  

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి  కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగి ఓటమి పాలయ్యారు.మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios