Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు బీజీపీ అభ్యర్థి కోసం భారీగా హవాలా సొమ్ము.. జూబ్లీహిల్స్ లో స్వాధీనం...

హైదారాబాద్ లో ఓ వ్యక్తి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు 90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థికి చేరవేయడానికే తీసుకువెడుతున్నట్టు కారు డ్రైవర్ చెప్పుకొచ్చాడు. 

Munugode bypoll : Hawala cash seized in hyderabad
Author
First Published Nov 1, 2022, 12:11 PM IST

హైదరాబాద్ :  మునుగోడు ఎన్నిక తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పోలీసులు బందోబస్తు తీవ్రం చేశారు. పోలీసులు తనిఖీల్లో రోజుకు కోట్ల కొద్దీ నగదు బయటపడుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లో తనిఖీలు నిర్వహించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 89.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు మునుగోడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థికి చేరవేసేందుకు డబ్బులు తీసుకు వెళుతూ పట్టుబడిన వ్యక్తి పోలీసులకు వెల్లడించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షామీర్పేట్ సమీపంలోని పూడూరుకు చెందిన కడారి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 82లోని త్రిపుర కన్స్ట్రక్షన్స్ కార్యాలయం నుంచి రూ.89.92 లక్షలు తీసుకుని టీఎస్ 27డి7777 థార్  కారులో వెళ్తున్నాడు. భారతీయ విద్యా భవన్ స్కూల్ సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు  అతడిని పట్టుకున్నారు. బ్యాగుల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు  కనిపించడంతో విచారించగా శ్రీనివాస్ నుంచి సరైన సమాధానం రాలేదు. డబ్బుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పచెప్పారు. 

కావాలనే రాజాసింగ్ మాటలు వక్రీకరించి, పీడీయాక్ట్.. హైకోర్టుకు ఎమ్మెల్యే వాదన

పోలీసులు విచారించగా తను ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జనార్ధన్ కారు డ్రైవర్ నని.. త్రిపుర కన్స్ట్రక్షన్ సైట్ నుంచి డబ్బు తీసుకొని రావాల్సిందిగా జనార్ధన్ చెప్పగా వచ్చానని ఆ మేరకు నగదు తీసుకుని వస్తున్నానని శ్రీనివాస్ చెప్పారు. డబ్బు మునుగోడు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి చేర్చడానికి వెళుతున్నట్టు పట్టుబడ్డ వ్యక్తి అంగీకరించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆ మేరకు నేరాంగీకార వాంగ్మూలం నమోదు చేశారు. శ్రీనివాస్ కు సెక్షన్ 41(ఏ) నోటీసు అందజేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ గేట్ వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ వద్ద సోమవారం మూడున్నర కేజీల బంగారం పట్టు బడింది. రూ.1.90 కోట్ల విలువైన బంగారాన్ని ఆదివారం తెల్లవారుజామున ఎస్ఎస్ టీ (స్టాటిస్టికల్ సర్వేటెన్స్ టీం) అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన హర్షద్, షరీఫ్, జావేద్, సుల్తానా  దుబాయ్ లోని బంధువుల ఇంటికి వెళ్లారు.

మూడున్నర కిలోల బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి సన్నని రేకులుగా  ప్యాక్ చేసి అండర్వేర్ లో ఉంచుకుని విమానంలో ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఎర్టిగా కారులో హైదరాబాద్ కు వస్తుండగా,  పంతంగి టోల్గేట్  వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దొరికిపోయారు. వారి నుంచి  బంగారం, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అధికారులకు అప్పగించారు. 

కాగా, పోలీసులు వీరిని బంగారం స్మగ్లింగ్ ముఠా అనుమానిస్తున్నారు. వీరు దుబాయ్ ఎలా వెళ్లారు? వీరికి బంగారం ఎవరు ఇచ్చారు? ఏర్పాట్లను దాటుకుంటూ ఇక్కడి వరకు ఎలా వచ్చారు? లేదంటే గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎవరైనా బంగారం ఇచ్చారా? అనేది ఆరా తీస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios