మునుగోడు బైపోల్ 2022: 14వ రౌండ్ లో టీఆర్ఎస్ హవా
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో 14వ రౌండ్ లో కూడ బీజేపీ అభ్యర్ధిపై ఆధిక్యంలో నిలిచారు.నాలుగో రౌండ్ నుండి టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచారు.
మునుగోడు:మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక కౌంటింగ్ లో 14వ రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదిక్యంలో నిలిచారు. 14వ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 6608 ఓట్లు , బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 5553 ఓట్లు వచ్చాయి.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ ను ఇవాళ నిర్వహిస్తున్నారు.చౌటుప్పల్ పట్టణంతో పాటు రూరల్ మండలంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే ఫస్ట్ రౌండ్ లో బీజేపీ కంటే టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ రౌండ్ లో బీజేపీ టీఆర్ఎస్ పై పైచేయి సాధించింది.మూడో రౌండ్ లో కూడ బీజేపీ లీడ్ దక్కించుకుంది. నాలుగో రౌండ్ నుండి 14 వ రౌండ్ వరకు టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. బీజేపీ కేవలం 2,3 రౌండ్లలో మాత్రమే లీడ్ లో నిలిచింది14 రౌండ్లను కలుపుకుంటే టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 95,304 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 85,157 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 22,449 ఓట్లు వచ్చాయి. 14 రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ 10,191 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
also read:మునుగోడు బైపోల్ 2022: 13 రౌండ్ లో కూసుకుంట్ల ఆధిక్యం
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.