మునుగోడు బైపోల్2022: కొయ్యలగూడెం నుండి నారాయణపురం వరకు రేవంత్ రోడ్ షో

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ రోడ్ షో నిర్వహించనున్నారు. కొయ్యల గూడెం నుండి సంస్థాన్ నారాయణపురం వరకు రేవంత్ రెడ్డి రోడ్ షో సాగనుంది.  
 

 Munugode bypoll 2022:  TPCC Chief Revanth Reddy To Conduct Road Show Today

హైదరాబాద్: మునుగోడుఅసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో  ఆదివారం నాడు రోడ్ షోలు నిర్వహించనున్నారు.

ఇవాళ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొయ్యలగూడం నుండి  సంస్థాన్ నారాయణపురం వరకు రో డ్ షోలు నిర్వహించనున్నారు.. ఇవాళ  పాయంత్రం నాలుగు గంటల నుండి  రోడ్ షోల్లో  రేవంత్ రెడ్డి పాల్గొంటారు.  ఆదివారం నాడు చౌటుప్పల్ లో సంత.  దీంతో పెద్ద ఎత్తున  సంతకు ప్రజలు వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ చౌటుప్పల్ లో రేవంత్  రెడ్డి రోడ్ షో ను ఏర్పాటు చేశారు.  

మునుగోడు అసెంబ్లీనియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలు ఇటీవలనే   సమావేశమయ్యారు. దసరా తర్వాత ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే కాంగ్రెస్ క్యాడర్  గ్రామాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్  విడుదల చేసిన తర్వాత ప్రచారంలో వేగాన్ని పెంచారు.  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రోడ్ షోలతో నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాల్లో ప్రచారాన్ని తీసుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. 

ఈ స్థానాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ నాయకత్వం సర్వశక్తులను ఒడ్డుతుంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో  ఒక్కో మండలానికి ఇద్దరు చొప్పున ఇంచార్జులను పార్టీ  నాయకత్వం నియమించింది. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి  ఈ  ఏడాది నవంబర్ 3 వ తేదీన పోలింగ్ జరగనుంది. మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఈస్థానం నుండి కాంగ్రెస్ పార్టీ  అభ్యర్ధిగా  దివంగత మాజీమంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతిని బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విజయం సాధించారు.

also ead:మునుగోడు ఉపఎన్నిక బరిలో బీఎస్పీ.. అందోజు శంకరాచారికి టికెట్, బీసీలే టార్గెట్

1994 నుండి  పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో పాటు స్రవంతి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.2014లో పార్టీ టికెట్ దక్కని కారణంగా ఆమె ఇండిపెండెంట్ గా బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో కూడా ఆమె టికెట్  కోసం తీవ్రంగా ప్రయత్నించింది. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం కోసం ఆమె ప్రయత్నించింది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.  దీంతో ఈ ఉప ఎన్నికల్లోపాల్వాయి స్రవంతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్నకైలాస్ లు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు  స్రవంతి వైపు మొగ్గుచూపడంతో  పార్టీ అధిష్టానం ఆమెకు టికెట్ కేటాయించింది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios