తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల వరకు 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 మున్సిపల్ కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Also Read:మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిలబడిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7613 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసింది.

ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Also Read:ఉత్తర తెలంగాణలో బిజెపి పటిష్టానికి పావులు కదుపుతున్న వివేక్

పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు వారిని శాంతింపజేశారు. అక్కడక్కడా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది.