Asianet News TeluguAsianet News Telugu

రెచ్చగొట్టే వ్యాఖ్యలు: ముంబైలో రాజాసింగ్ పై కేసు

గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్  పై ముంబైలో  కేసు నమోదైంది.  విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు  చేసినందుకు  కేసు  పెట్టారు. 

Mumbai Police  Files Case Against  Goshamahal MLA Raja Singh  lns
Author
First Published Mar 30, 2023, 1:52 PM IST

హైదరాబాద్: గోషామహల్  ఎమ్మెల్యే  రాజాసింగ్ పై  ముంబైలో  కేసు నమోదైంది.  ఈ ఏడాది జనవరి  29న జరిగిన సభలో   రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు  ఈ కేసు నమోదైంది. రాజాసింగ్  పై  ఐపీసీ 153ఎ 1(ఎ) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ  ఏడాది  జనవరి  29న   ముంబైలో  జరిగిన కార్యక్రమంలో  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు  గాను  రాజాసింగ్  కు  హైద్రాబాద్ పోలీసులు  నోటీసులు  కూడా ఇచ్చారు.  రాజాసింగ్ కు  బెయిలిచ్చిన  సమయంలో  రెచ్చగొట్టే వ్యాఖ్యలు  చేయవద్దని తెలంగాణ హైకోర్టు  షరతు విధించిందని  ఆ నోటీసులో  పోలీసులు గుర్తు చేశారు.  నిబంధనలకు  ఉల్లంఘించారని  పోలీసులు ఆ నోటీసులో  పేర్కొన్నారు. ఈ విషయమై  వివరణ ఇవ్వాలని  పోలీసులు కోరారు.ముంబైలో  రెచ్చగొట్టే వ్యాఖ్యలు  చేశారని  మంగళ్ హట్ పోలీసులు నోటీసులు జారీ చేయడంపై  రాజాసింగ్  ఈ ఏడాది జనవరి  31న స్పందించారు.  ధర్మం కోసం అవసరమైతే  జైలుకు  వెళ్తానని  పేర్కొన్నారు.  పీడీయాక్ట్ పై  జైల్లో  ఉన్న   రాజాసింగ్ కు  2022 నవంబర్  9వ తేదీన  తెలంగాణ హైకోర్టు  షరతులతో  కూడిన బెయిల్ మంజూరు చేసింది .

also read:శ్రీరామనవమీ వేడుకల్లో నన్ను టార్గెట్ చేశారు .. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

2022  అక్టోబర్ మాసంలో హైద్రాబాద్ లో  కమెడియన్  మునావర్  షోకు  రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ షో కు అనుమతివ్వడంపై  రాజాసింగ్  సోషల్ మీడియాలో  ఓ వీడియోను  పోస్టు  చేశాడుఈ వీడియో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా  ఉందని  ఎంఐఎం ఆరోపించింది.   పలువురు ఈ విషయమై  ఆందోళనలు నిర్వహించారు.  రాజాసింగ్  పై  నమోదైన  కేసులను దృష్టిలో  ఉంచుకొని పీడీ యాక్ట్  ను నమోదు  చేశారు. ఈ కేసులో  జైల్లో  ఉన్న రాజాసింగ్ కు గత ఏడాది నవంబర్  9న బెయిల్ మంజూరు చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios