తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. వేదికపై తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ ఆమె అలకబూనారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యఅతిథిగా శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఆయన ప్రసంగిస్తుండగా వేదిక ఎక్కిన ఎమ్మెల్యే సీతక్కకు అక్కడ మరో కుర్చీ కనిపించలేదు. దీంతో వెంటనే దిగొచ్చిన సీతక్క మీడియా గ్యాలరీలో కొద్దిసేపు కూర్చొని వెళ్లిపోయారు.