Asianet News TeluguAsianet News Telugu

మినిస్టర్ క్వార్టర్స్‌ ముట్టడికి ఎమ్మార్పీఎస్‌ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత..

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్ కార్వర్ట్స్‌ ముట్టడిని ఎమ్మార్పీఎస్‌ నేతలు యత్నించారు. పోలీసు రిక్రూట్‌మెంట్ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు. 

MRPS Leaders Protest At Minister Quarters
Author
First Published Sep 12, 2022, 12:56 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్ కార్వర్ట్స్‌ ముట్టడిని ఎమ్మార్పీఎస్‌ నేతలు యత్నించారు. పోలీసు రిక్రూట్‌మెంట్ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 20 మార్కులు తగ్గించాలని కోరారు. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. క్రమంలోనే మినిస్టర్ క్వార్టర్స్‌కు ఎమ్మార్పీఎస్‌ నేతలు యత్నించారు. 

దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వారిని అరెస్ట్ చేసిన అక్కడి నుంచి తరలించారు. దీంతో మినిస్టర్ క్వార్టర్స్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసు రిక్రూట్‌మెంట్ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గించేవరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు. 

Also Read: విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం: అసెంబ్లీలో కేసీఆర్

మరోవైపు నేడు, రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వీఆర్‌ఏలు, విద్యార్థి సంఘాలు.. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అసెంబ్లీ దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అసెంబ్లీ చుట్టుపక్కల ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios