Asianet News TeluguAsianet News Telugu

విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం: అసెంబ్లీలో కేసీఆర్

విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్ర విద్యుత్ సంస్కరణ బిల్లుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 

 No justice to Telangana From  Ap bifurcation act 2014 : KCR
Author
First Published Sep 12, 2022, 11:56 AM IST

హైదరాబాద్: విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. 

తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ సవరణ బిల్లుపై  స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రసంగిస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. 

అభివృద్దికి కొలమానంలో విద్యుత్ వినియోగం కూడా ఒకటని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.  తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తలుచుకొంటేనే భయమేస్తుందని కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించారన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వం 2014లో తొలి కేబినెట్ సమావేశం తెలంగాణకు చెందిన ఏడు మండలాలను లాక్కొన్నారన్నారు. అంతేకాదు సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా తీసుకున్నారన్నారు

.అప్పటి ఏపీ సీఎం చేతిలో కీలుబొమ్మగా మారి నరేంద్ర మోడీ తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ఈ విషయమై తెలంగాణలో బంద్ నిర్వహించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు నరేంద్ర మోడీ వైఖరిని తాను తీవ్రంగా తప్పుబట్టినట్టుగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 

నరేంద్ర మోడీ మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని ఆనాడే తాను చెప్పినట్టుగా చెప్పారు. ఈ విషయమై తాము లోక్ సభనను ఐదు రోజుల పాటు స్థంభింప చేసినట్టుగా కేసీఆర్  సభ దృష్టికి తీసుకు వచ్చారు.  పార్లమెంట్ లో విపక్ష సభ్యులు మాట్లాడకుండా అధికార బీజేపీ సభ్యులు అడ్డుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారు. ఎదుటి వాళ్లు చెప్పే మాటలు వినే సంస్కారం లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ చెప్పారు.  ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో  ఉచిత విద్యుత్ ఇస్తారని బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. 

కానీ ఇప్పుడు విద్యుత్ మీటర్లు పెడుతున్నారన్నారు. ఈ పద్దతిని నిరసిస్తూ యూపీ రైతులు ఆందోళన చేస్తున్నారని కేసీఆర్ వివరించారు. విద్యుత్ సంస్కరణ అని అందమైన పేరు పెట్టి రైతులను దగా చేస్తున్నారని కేసీఆర్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. పక్కనే ఉన్న ఏపీ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు.ఏపీరైతులు వ్యవసాయ మోటరార్లకు మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారని కేసీఆర్ ప్రస్తావించారు. పైకి  ఒకటి చెబుతూ మరోటి అమలు చేసే చరిత్ర బీజేపీదని కేసీఆర్ విమర్శించారు. 

విద్యుత్ సవరణ బిల్లు ఆధారంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేంద్ర బిల్లును రఘునందన్ రావు ఎలా సమర్ధిస్తారో ఆయన ఆలోచించుకోవాలన్నారు. 

తెలంగాణలో ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు ఇతర ఖర్చులు తగ్గించి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు.  ఆర్టీసీని అమ్మితే వెయ్యి కోట్లు బహుమతిగా ఇస్తామంటున్నారని సీఎం కేసీఆర్ పరోక్షంగా కేంద్రంపై ఆరోపణలు చేశారు.ఈ విషయమై తమకు లేఖలు వస్తున్నట్టుగా చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios