ఎమ్మార్పీఎస్ ఈనెల 13వ తేదీన తలపెట్టిన తెలంగాణ బంద్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. బంద్ జరిపే బదులు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది.

ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ విలేకరులతో మాట్లాడారు. ఇంటర్  విద్యార్థుల కు ఇబ్బంది కలిగించడం భావ్యం కాదన్న ఉద్దేశంతోనే తాము బంద్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమ బంద్ కు మద్దతు ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలకు మంద ధన్యవాదాలు తెలిపారు. పనిలో పనిగా తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరిపై మంద కృష్ణ ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రికి ఎన్నిసార్లు లేఖలు రాశారో బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు.

సోమవారం నుండి వర్గీకరణ కోసం ఎంపీ లు మాట్లాక పోతే మాదిగలకు శత్రువులు గా గుర్తించి మీకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. టిఆర్ఎస్ కంటే ఎమ్మార్పీఎస్ కు విద్యార్థులు భవిష్యత్ గురించి ఆలోచన ఎక్కువగానే ఉందని మంద స్పష్టం చేశారు.