హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్. ట్విట్టర్ ద్వారా విషెస్ తెలుపుతూనే సంతోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

''పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మీరు మరింతకాలం ప్రజాజీవితంలో కొనసాగడమే కాదు మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నా. మీరు ఎప్పుడూ ఇలాగే మాకు స్పూర్తి నిలవాలి. సమకాలీన  రాజకీయాల్లో నా సోదరుడిదే రెండో స్థానమని... మరెవ్వరూ ఆయనకు పోటీ కారని గర్వంగా చెబుతున్నా. మీతో కలిసి గడిపిన ఆ చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుచేసుకుంటాను'' అంటూ కేటీఆర్ తో కలిసున్న చిన్ననాటి ఫోటోలను జతచేస్తూ సంతోష్ ట్వీట్ చేశారు. 

సంతోష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందిచారు. ''థ్యాంక్యూ సంతూ'' అంటూ రిప్లయ్ ఇచ్చారు. 

 

ఇకపోతే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా వుండనున్నారు. కేవలం ఆయన  కుటుంబసభ్యులతో కలిసి పుట్టినరోజు జరుపుకోనున్నారు. అయితే ఆయన రాజకీయ, సినీ, వ్యాపార  ప్రముఖుల నుండే కాకుండా టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానుల నుండి సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు అందుకుంటున్నారు.