తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన... 111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్ అక్రమ నిర్మాణాలు చేపట్టారని రేవంత్ విమర్శించారు.

Also Read:రేవంత్‌కు టీఆర్ఎస్ కౌంటర్:వట్టినాగులపల్లిలో అక్రమ కట్టడాలు

కేటీఆర్ ఆ భూమిని లీజుకు తీసుకున్నాడని బాల్క సుమన్ చెబుతున్నారన్నారు. అక్కడ తనకు ఎలాంటి భూమి లేదని కేటీఆర్ కూడా ట్వీట్ చేశారని రేవంత్ గుర్తుచేశారు. డ్రోన్ కేసులో తనను అరెస్ట్ చేసినప్పుడు .. కేటీఆర్ అక్కడ ఉంటున్నారని పోలీసులు న్యాయస్థానానికి నివేదిక ఇచ్చారని ఆయన అన్నారు.

జన్వాడ ఫాంహౌస్ 301 నుంచచి 313 సర్వే నెంబర్లలో విస్తరించి వుందని.. 301 సర్వే నెంబర్లలో మంత్రి కేటీఆర్ సతీమణి పేరిట 3 ఎకరాలుఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూములు లేవని కేటీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని.. వట్టినాగులపల్లిలో తమకు భూములున్న మాట వాస్తవమేనని రేవంత్ అంగీకరించారు.

Also Read:తప్పుడు ప్రచారంపై న్యాయపరంగా ఎదుర్కొంటా: ఎన్జీటీ నోటీసులపై కేటీఆర్

తన అక్రమ నిర్మాణం ఎక్కడున్నా కూల్చడానికి సిద్ధమని.. మీరు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే బర్తరఫ్ చేయాలని ఆయన పేర్కొన్నారు.