ఐదేళ్లలో కోటీశ్వరులైంది వారే: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
గత ఐదేళ్ల పాలనలో టీఆర్ఎస్ నాయకులనే కోటీశ్వరులుగా మారారంటూ ఫైరయ్యారు. టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి.
గత ఐదేళ్ల పాలనలో టీఆర్ఎస్ నాయకులనే కోటీశ్వరులుగా మారారంటూ ఫైరయ్యారు. టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. ఆదివారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు.
Also Read:అతని దెబ్బకు ఎవరైనా అబ్బ అనాల్సిందే.. ఏకంగా సీనన్నే
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని స్పష్టం చేశారు. దీనిపై చర్చకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు. భూకబ్జాలు, అనుమతి లేని భవంతుల నిర్మాణంలో టీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారని రేవంత్ వ్యాఖ్యానించారు.
Also Read:Year Roundup 2019: ఒక దిశ, ఒక హాజీపూర్.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన తెలంగాణ
మల్కాజిగిరి నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో అది అమలు కావడం లేదని రేవంత్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాగా రావాల్సిన 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్ధితి తలెత్తిందదని ఆయన విమర్శించారు.