ఈ జ్యోతి కి టిఆర్ఎస్ ఎంపి కవిత ఆపన్న హస్తం

MP Kavitha helps for Jyothi's operation
Highlights

మరో సాయం

రెక్కాడితే కాని డొక్కాడని గిరిజన మహిళ జ్యోతి అనారోగ్యం తెలిసి నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చలించిపోయారు. డాక్టర్లతో మాట్లాడి ఆపరేషన్ చేయించారు.  నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్ పల్లి గ్రామానికి చెందిన జ్యోతి అక్యూట్ ఇంటెస్టయినల్ అబ్ స్ట్రక్షన్ వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఏమి తిన్నా, ఆఖరుకు గ్లాసుడు మంచి నీళ్ళు తాగినా పొట్ట అసాధారణముగా ఉబ్బుతుంది. దీంతో కూర్చోలేదు.. నడవలేదు..రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టదు..అయాసంతో ప్రాణాలు తోడేసే వ్యాధిని నయం చేయించుకునేందుకు దాదాపు ఆరు నెలలు పాటు నిజామాబాద్ లోని అందరూ డాక్టర్లను కలిసింది. చివరికి సికిందారాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రి లో జ్యోతి చేరింది. 3-4 లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పడంతో జ్యోతి సోదరుడు విజయ్ దియావత్ తన చెల్లెలి పరిస్థితి ని ఎంపి కవితకు ట్విట్టర్ ద్వారా వివరించారు. స్పందించిన కవిత విజయ్ కు కాల్ చేసి అధైర్య పడవద్దని చెప్పారు. ఆసుపత్రి యాజమాన్యం తో మాట్లాడి ఆపరేషన్ చేయించారు. నిన్న చేసిన ఆపరేషన్ విజయవంతం అయ్యిందని డాక్టర్లు తెలిపారు. తన సోదరికి వైద్యం చేయించిన ఎంపి కవితకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

loader