నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలో చెరువుల పరిశీలనకు వెళ్లారు గుత్తా. అయితే అక్కడ పలు గ్రామాల్లో చెరువులను పరిశీలించారు. అదే సందర్భంలో చింతకుంట అనే గ్రామం చెరువులోకి దిగారు. ఆ సమయంలో తన చెప్పులను వేరే వ్యక్తితో మోపించారు. ఇలా ఒకే గ్రామంలో కాకుండా చాలా గ్రామాల్లో చెప్పులను ఇలాగే మోపించినట్లు చెబుతున్నారు.

అయితే చింతకుంట చెరువు వద్ద ఈ తతంగాన్ని మీడియా ప్రతినిధులు షూట్ చేశారు. మీడియా వారు షూట్ చేస్తున్న విషయాన్ని గుర్తు పట్టిన గుత్తా గన్ మెన్ ఆ చర్యను కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మీడియా కెమెరాల కండ్లు గుత్తా బాగోతాన్ని గుప్పిట పట్టాయి. ఇంకేముంది.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసేస్తున్నాయి. గుత్తా బాగోతం మీరూ చూడండి. కింద వీడియోలో...