Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏడ్చిన మోత్కుపల్లి (వీడియో)

ఎందుకంటే ?

Motkupalli weeps at NTR ghat

తెలగుదేశం పార్టీకి తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు ఇంకా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మహానాడు కు తనకు ఎందుకు ఆహ్వానం పంపలేదని ఆయన టిడిపి అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల మాదిగ లీడర్లకు టిడిపిలో గౌరవం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీలో పెద్ద పీట వేశారని ఆరోపించారు. తనను మాత్రం అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

"

ఇక సోమవారం కూడా మోత్కుపల్లి టిడిపి అధినేత చంద్రబాబుపై మాటల దాడి కొనసాగించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను గుర్తుకు తెచ్చుకుని బోరుమని విలపించారు. తనను పార్టీలో చీడపురుగులా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పండుగ మహానాడుకు కూడా తనకు ఆహ్వానం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ దయ వల్లే నాలాంటి పేదవాళ్లు రాజకీయంలో ఉన్నారు. ఆలేరు ప్రజలను నన్ను ఇంతవాడిని చేశారు.

మరోవైపు మోత్కుపల్లి తెలంగాణ సిఎం కేసిఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు కంటే కేసిఆర్ చాలా నయం అని చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసిఆర తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

మొత్తానికి టిడిపి రేగిన మోత్కుపల్లి తుపాను ఇప్పట్లో చల్లారేలా లేదని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios