Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ లాట్ కొడ్తే అక్కడ పడ్డావు: చంద్రబాబుపై మోత్కుపల్లి తిట్ల వర్షం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. 

Motkupalli Narsimhulu makes verbal attack on Chnadrababu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసిఆర్ లాట్ కొడితే అక్కడ పడ్డావని ఆయన వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడ్డానికి మోడీ, అరుణ్ జైట్లీ, కేసిఆర్ కాళ్లు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. 

ఆత్మను అమ్ముకునే నీచుడు చంద్రబాబు అని ఆయన అన్నారు. కమ్మకులస్తులారా చంద్రబాబును ఓసారి ఓడించండని ఆయన పిలుపునిచ్చారు. చంద్రాబాబును ఓడించి ఎన్టీఆర్ ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఏడుకొండలవాడిని వెేడుకుంటున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీలో తాను చంద్రబాబు కన్నా సీనియర్ అని అన్నారు. తాను 1982లోనే టీడీపిలోకి వచ్చానని అన్నారు. 

చంద్రబాబు అంటేనే నమ్మకద్రోహి అని అన్నారు. చంద్రబాబు ఓ పిరికిపంద అని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో నిన్ను, నీ అనుచరుడు రేవంత్ రెడ్డిని దొంగను పట్టుకున్నట్లు పట్టుకున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసులోని ఆడియోలో వాయిస్ నీది కాదని చెప్పగలవా అని అడిగారు. చంద్రబాబు తన కుటిల బుద్ధిని బయటపెట్టుకున్నాడని ఆయన అన్నారు. 

దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అని, దళితులు చంద్రబాబుకు ఓటేయవద్దని అన్నారు. ఆత్మను అమ్ముకుని బతికే నీచుడు చంద్రబాబు అని అన్నారు. తనను బహిష్కరించి చంద్రబాబు తన కుటిల బుద్ధిని బయటపెట్టుకున్నారని ఆయన అన్నారు. నీకు ప్రభుత్వం వస్తే ఏం చేశావని అడిగారు. చంద్రబాబు నుంచి తాను ఏమీ ఆశించలేదని, ఒక్క మాట చెప్తే తాను మహానాడుకు వెళ్లేవాడిని అని అన్నారు. 

టీడీపి జెండా చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్ దని అన్నారు. చంద్రబాబు బ్రతుకంతా కుట్రలు, కుతంత్రాలు అని అన్నారు. ఓటుకు నోటు కేసులో నిన్ను, రేవంత్ రెడ్డిని పట్టుకుంటే నువ్వు కాళ్లబేరానికి వచ్చావని ఆయన చంద్రబాబునుద్దేశించి అన్నారు. హైదరాబాదు వదిలి అమరావతికి ఎందుకు వెళ్లావని ఆయన చంద్రబాబును అడిగారు. 

మొగాడివైతే సొంత జెండాతో రా అని ఆయన చంద్రబాబును సవాల్ చేసారు. కేసీఆర్ గురించి మాట్లాడాలంటే గజగజ వణుకుతున్నారని ఆయన చంద్రబాబును అన్నారు. ఎన్టీఆర్ ను చంపి పార్టీని ఎత్తుకెళ్లావని అన్నారు. తాను లేకపోతే ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి చంద్రబాబుదని, పనికిమాలినవాళ్లతో తనను తిట్టిస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెసులోకి పంపించారని అన్నారు.

దళారీ నేత రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడని, రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోలేదని, తాను దళితుడిని కాబట్టే తనపై చర్యలు తీసుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు అనుకున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో లేకున్నా చంద్రబాబు పక్కన తాను నిలబడ్డానని అన్నారు. చంద్రబాబుపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

తన వెనక ఎవరూ లేరని, తానే ఉన్నా నని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబుకు వెట్టి చాకిరీ చేస్తేనే ఎవరూ లేరని అన్నారు. ఎపి ప్రజలు చంద్రబాబును రాజకీయంగా బొంద పెడుతారని అన్నారు. చంద్రబాబు తనకు అన్యాయం చేశారని, మాదిగ బిడ్డను కాబట్టే అన్యాయం చేశారని అన్నారు. తెలంగాణలో పార్టీని చంద్రబాబు సర్వనాశనం చేశారని, తెలంగాణ ప్రజలు చంద్రబాబును సస్పెండ్ చేశారని అన్నారు.  

ఎవరైనా దళితుడిగా పుట్టాలని అనుకుంటాడా అని సిగ్గు లేకుంటా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. నువ్వు  నీచుడవని నువ్వే నిరూపించుకున్నావని ఆయన చంద్రబాబును అన్నారు. మాలమాదిగల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని అన్నారు. కులాల మధ్య, వర్గాల మధ్య, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని అన్నారు. 

చంద్రబాబు లాంటి నీతిమాలిన మనిషి మరొకరు లేరని అన్నారు. రేవంత్ రెడ్డి నిన్ను, నీ పారటీని బజారున వేశాడని, అయినా చర్యలు తీసుకోలేదని అన్నారు. రేవంత్ రెడ్డిని ఏమీ అనవద్దని రమణ తనకు చెప్పాడని అన్నారు. దళతి జాతిని మోసం చేసి చంద్రబాబు బతుకుతున్నాడని అన్నారు. తనకు దేవుడు తోడుగా ఉంటాడని అన్నారు. ఒక్క నాయకుడిని ఓడించడానికి మరో నాయకుడి చంద్రబాబు ప్రేరేపిస్తాడని అన్నారు.

దుర్మార్గుడైనా, నీచుడైనా, పాపాత్ముడైనా చంద్రబాబు పక్కన ఉన్నానని, ఉమామాధవరెడ్డికి మద్దతు కోసం పార్టీలోకి రావాలంటే వచ్చానని ఆయన అన్నారు చంద్రబాబు అబద్ధాలు మాట్లాడితే ఎవరు నమ్ముతారని అన్నారు. చంద్రబాబుకు కులపిచ్చి అని అన్నారు. హైదరాబాదులో రెండు భవనాలు కట్టి తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు అంటారని, అమరావతిలో రెండు భవనాలు కట్టారని ఆయన అన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేయడానికి వందల ఏళ్లు పట్టిందని ఆయన చెప్పారు.

తిరుపతి లడ్డు, శాలువాలతో మోడీ వద్దకు చంద్రబాబు వెళ్లాడని, ప్రత్యేక హోదా కోసం వెళ్లలేదని, కేసిఆర్ పెట్టిన కేసు నుంచి బయటపడడానికి వెళ్లాడని అన్నారు. దమ్ముందా, సిగ్గుందా, నీ వాయిస్ కాదని చెప్పగలవా, సెబాస్టియన్ తో మాట్లాడావా లేదా, మొగోడివైతే మాట్లాడానని చెప్పవచ్చు కదా అని అన్నారు. ఆ వాయిస్ విన్నవాడు నోట్లో ఊంచుతాడని అన్నారు.

బ్రోతల్ హౌస్ మాదిరిగా చంద్రబాబు రాజకీయాలను నడుపుతున్నాడని అన్నారు. కేసిఆర్ దెబ్బ చంద్రబాబు పారిపోయాడని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఆరు సార్లు గెలిచానని, చంద్రబాబు ఏడు సార్లు గెలిచాడని, తాను ఏమీ లేకున్నా గెలిచానని అన్నారు. చంద్రబాబు తనకు పదవి ఇవ్వలేదని, ఎన్టీఆర్ ఇచ్చాడని అన్నారు. పార్టీని ముందుకు తీసుకుని వెళ్లినప్పుడు చంద్రబాబు ఎక్కుడున్నాడని అడిగారు.

నీ జీవితమే అవినీతమయం, కుట్ర అని చంద్రబాబును అన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును ఎప్పుడో సస్పెండ్ చేశారని అన్నారు. ఓటుకు నోటు కేసు పెట్టినప్పుడు టీడీపిని టీఆర్ఎస్ లో చంద్రబాబు విలీనం చేశారని అన్నారు. పిరికి పందలా పారిపోయావని ఆయన చంద్రబాబును అన్నారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు చంద్రబాబు చిత్రహింసలకు మరణించారని అన్నారు. 

ప్రత్యేక హోదాపై మాట మార్చింది చంద్రబాబే అని అన్నారు. జగన్ ప్రత్యేక హోదా తెస్తారని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి చంద్రబాబు పొగిడారని, ప్రత్యేక హోదా రాదని చెప్పిన దళారి అని అన్నారు. చంద్రబాబు వల్లనే రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిందని అన్నారు. ప్రత్యేక హోదా బ్రహ్మపదార్థం కాదని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు వాడుకున్నారని, చచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ ను చంపుతున్నాడని అన్నారు. ఆంధ్ర ప్రజలు చంద్రబాబును బొంద పెడుతారని, టీడీపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాదని అన్నారు. 

నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావో తెలియదా, బ్లాక్ మనీ హెరిటేజ్ లో పెట్టి లాభాలను చూపిస్తున్నావని ఆయన చంద్రబాబుపై ఆరోపణ చేశారు. సుద్దపూసలమని చెప్పుకుంటాడని అన్నారు. చేయలేకపోయానని చంద్రబాబు తనకు చెప్పలేదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios