జగన్ . పవన్ ఏకమైతే టీడీపీకి డిపాజిట్ కూడా రావు : మోత్కుపల్లి

జగన్ . పవన్ ఏకమైతే టీడీపీకి డిపాజిట్ కూడా  రావు :  మోత్కుపల్లి

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోత్కుపల్లి నర్సింహులు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు కన్నీటిపర్యంతమయ్యారు . పార్టీ ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఎన్టీఆర్‌ మహోన్నత ఆశయంతో టీడీపీని స్థాపించారు. ఆయన వల్లే నాలాంటి పేదలు ఎంతోమంది ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. అంతటి మహనీయుడిపైనే కుట్రలుపన్నిన నీచుడు చంద్రబాబు నాయుడు. ఏపీలో పవన్, జగన్ ఏకమైతే టీడీపీకి డిపాజిట్ కూడా రాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page