కాంగ్రెస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. నేతి విద్యాసాగర్, కపిలవాయి దిలీప్ కుమార్‌లు కూడా

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హస్తం కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. నర్సింహులతో పాటు మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, కపిలవాయి దిలీప్ కుమార్‌తో పాటు పటాన్ చెరుకు చెందిన బీఆర్ఎస్ నేత నీలం మధు కాంగ్రెస్‌లో చేరారు. 

motkupalli narasimhulu joined in congress party ksp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. నిన్న గాక మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుకున్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీ సంతోష్ కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హస్తం కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. నర్సింహులతో పాటు మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, కపిలవాయి దిలీప్ కుమార్‌తో పాటు పటాన్ చెరుకు చెందిన బీఆర్ఎస్ నేత నీలం మధు కాంగ్రెస్‌లో చేరారు. 

1983లో మోత్కుపల్లి నరసింహులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో  ఆరు దఫాలు  ఆయన  ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ గా  నరసింహులు  విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో  తుంగతుర్తి నుండి  ఆయన టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.  2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని మధిర నుండి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి  మోత్కుపల్లి నరసింహులు ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారు.

ALso Read: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మోత్కుపల్లి భేటీ: వచ్చే నెలలో కాంగ్రెస్‌లోకి

ఆ తర్వాత  చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో  మోత్కుపల్లి నరసింహులు  టీడీపీని వీడి  బీజేపీలో చేరారు. బీజేపీలో  పరిణామాలపై అసంతృప్తితో  మోత్కుపల్లి నరసింహులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ తీరుపైనా అసంతృప్తితో వున్న ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 29న కర్ణాటక డిప్యూటీ సీఎం  డీకే శివకుమార్ తో మోత్కుపల్లి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన కాంగ్రెస్‌లో చేరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios