తెలంగాణ టిడిపి మీటింగ్ గరం గరం గా సాగింది. సమావేశంలో రేవంత్ రెడ్డి పై మోత్కుపల్లి నర్సింహ్ములు, అరవింద్ కుమార్ గౌడ్ ఎగబడ్డారు. రాహుల్ గాంధీతో భేటీపై వివరణ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో రేవంత్ కు, వారిద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది.

సమావేశం ప్రారంభం కాగానే మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డి కలవాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రాహుల్ ను కలిశారా? కలిస్తే ఏం మాట్లాడారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దీనికి రేవంత్ ఘాటుగానే స్పందించారు. నేను ఎవరిని కలిశానో, ఎందుకు కలిశానో ఇక్కడున్నోళ్లకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నేను వివరణ ఇవ్వాల్సి ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకే ఇస్తాను తప్ప ఇక్కడ వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా, టిడిఎల్పీ ఫ్లోర్ లీడర్ గా తనను నిలదీసే అధికారం ఇక్కడ ఎవరికీ లేదని రేవంత్ గట్టిగానే అన్నారు.

అయితే మోత్కుపల్లి స్పందిస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు సమాచారం ఇచ్చే రాహుల్ ను కలిశారా? లేక సొంతంగా వెళ్లి కలిశారా అని ప్రశ్నించారు. దీనికితోడు టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మీద ఎందుకు ఆరోపణలు చేశారని నిలదీశారు. పరుష పదజాలం ఎందుకు వాడినట్లు అని ప్రశ్నించారు.

అయితే రేవంత్ స్పందిస్తూ... దీనికంతటికీ నీవే కారణం అన్న అని మోత్కుపల్లికి కౌంటర్ వేశారు.  టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటాం అని ఎలా చెప్తావ్ అని నిలదీశారు. అలా పొత్తు పెట్టుకుంటే మనం  ఇంకా ఎవడి మీద ఫైట్ చేయాలి అని ఎదురు ప్రశ్నించారు  రేవంత్. ఈ విషయంలో అన్ని విషయాలు బాబు కి చెప్తా... అంటూ రేవంత్ సమావేశంలో చెప్పడంతో ఇక ఈ సమావేశంలో ఉండడమెందుకని మోత్కుపల్లి సమావేశంం నుంచి నిష్క్రమించారు. దీంతో టి టిడిపి నేతలు సమావేశాన్ని ముగించేశారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దీపావళి వేడకల్లో 30 మంది పోరగాళ్లు గాయపడ్డరు... వీడియో చూడండి.

https://goo.gl/hMBFkQ