తొమ్మిదిరోజుల కవలపిల్లలను సంపులో పడేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి.. కారణం తెలిస్తే...

పుట్టిన పిల్లలంతా పురుట్లోనే చనిపోతున్నారన్న వేదనను తట్టుకోలేక ఓ తల్లి తొమ్మిదిరోజుల కవలలను సంపులో వేసి చంపేసింది. ఆ తరువాత తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. 

mother kills 9 days old twins and committed suicide in alwal, hyderabad - bsb

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఆల్వాల్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కవలలు పుట్టిన తొమ్మిది రోజులకే వారిని చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి.  హైదరాబాదులోని ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కవలలుగా పుట్టిన ఆడపిల్ల, మగ బిడ్డలను పుట్టిన తొమ్మిది రోజులకే సంపులో వేసి చంపేసింది. కవలలు పుట్టారని సంబరాలు చేసుకున్న ఆ కుటుంబాల్లో.. తొమ్మిది రోజులకే ఆ సంతోషం ఆవిరయ్యింది. ఆ తర్వాత తాను బలవన్మరణానికి పాల్పడింది ఆ మహిళ. దీనికి సంబంధించి మహిళ కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

నర్సింగరావు, సంధ్యారాణి భార్యాభర్తలు. వీరికి 2012లో వివాహం జరిగింది. వీరిది మేనరికం. నర్సింగరావు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  వీరు బేగంపేట అన్నానగర్ కు  చెందినవారు. ప్రస్తుతం ఆల్వాల్ కానాజీ కూడా పరిధిలోని శివనగర్ లో వీరిద్దరూ కాపురం ఉంటున్నారు. కాగా, పెళ్లయిన తర్వాత ఐదు సంవత్సరాలకు 2017లో వీరికి కవలలు జన్మించారు. కానీ, పుట్టుకతోనే వారిద్దరికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఓ శిశువుకు అంగవైకల్యం ఉండగా మరొకరికి గుండెలో రంధ్రాలు ఉన్నాయి.

సంగారెడ్డిలో కారు, మినీ బస్సు ఢీ.. చెలరేగుతున్న మంటలు..

దీంతో ఆ చిన్నారులు ఇద్దరు వారం రోజుల తేడాతో చనిపోయారు. ఆ గర్భశోకాన్ని అధిగమించేలోపే 2018లో మరోసారి సంధ్యారాణికి గర్భం వచ్చింది. అయితే, ఈసారి అబార్షన్ అయ్యింది. వెంటవెంటనే ఇలా జరగడంతో సంధ్యారాణి మానసికంగా  తీవ్రంగా వేదనకు గురైంది. ఈ క్రమంలోనే 2022లో మరోసారి గర్భవతి అయింది. ఈనెల 11వ తేదీన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కవలలు జన్మించారు. వీరిలో ఒకరు ఆడ, మరొకరు మగ. 

ఈసారి ఆమెకు నెలలు నిండకముందే ప్రసవం వచ్చింది. మగ శిశువు బరువు తక్కువగా పుట్టాడు. దీంతో మూడు రోజులపాటు ఐసీయూలో ఉంచారు. అప్పటికే రెండుసార్లు పిల్లలను కోల్పోయిన ఆమె వీటితో ఆందోళనకు గురైంది. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యింది. చిన్నారిని ఐసియూ నుంచి తల్లి ఒడికి చేర్చి, హాస్పిటల్ నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈనెల 14న పిల్లలతోపాటు ఇంటికి చేరుకున్నారు.  అయితే అప్పటినుంచి ఆమె ఆందోళనగానే ఉంది. పాత సంఘటనలే పునరావృతం అవుతాయని భయపడి పోతుంది.

దీంతో దారుణమైన నిర్ణయానికి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి భర్త గాడనిద్రలో ఉండగా, చిన్నారులు ఇద్దరినీ తీసుకొని ఇంటి బయటకి వచ్చింది.. ఇంటి ఆవరణలో ఉన్న చంపులో చిన్నారులు ఇద్దరినీ పడేసింది.  ఆ తర్వాత తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత తెల్లవారుజామున భర్తకు మెలకువ వచ్చింది.  వచ్చింది. ఎలాంటి అలికిడి లేకపోవడంతో భార్య పిల్లల కోసం  వెతికాడు.  వారు కనిపించకపోవడంతో ఆందోళనతో  ఇల్లు మొత్తం వెతుకుతున్న క్రమంలో ఇంటిముందు సంపు తెరిచి ఉండడం కనిపించింది.

వెంటనే అందులో చూడగా భార్య మృతదేహంతో పాటు..  తొమ్మిది రోజుల చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. అది చూసి షాక్ కు గురయ్యాడు. వెంటనే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు, తన తల్లిదండ్రులకు తెలిపాడు పోలీసులకు సమాచారం అందించాడు.  ఇంట్లో మృతురాలు రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ‘బిడ్డల ఆరోగ్య పరిస్థితి  బాగా లేకపోవడంతో.. గతంలో జరిగిన ఘటన మళ్లీ జరుగుతాయని భయంగా ఉంది.. అందుకే ఆత్మహత్యకు చేసుకుంటున్నాను’ అంటూ మృతురాలు లేఖలో రాసింది. ఈ మేరకు ఈ లెటర్ ఇంట్లో దొరికిందని కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios