మద్యం అలవాటు ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. తల్లీ, ఇద్దరు పిల్లల బలన్మరణానికి ప్రయత్నించడానికి కారణం అయ్యింది. ఈ ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.  

ఖమ్మం : కూలీ పనులు చేస్తే వచ్చే డబ్బు అంతంత మాత్రమే కావడం.. దానికితోడు భర్త మద్యానికి బానిస కావడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ దారుణానికి తెగించింది. తన ఇద్దరు కుమార్తెలకు అన్నంలో పురుగుల మందు కలిపి పెట్టి.. తాను తిని ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చిన్నకట్టుగూడెంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చిన్న కట్టుగూడెం గ్రామానికి చెందిన బానోతు శివ, ఉమా భార్య భర్తలు. వీరికి ఐదో తరగతి చదివే భాను శ్రీ, నాలుగో తరగతి చదువుతున్న శ్రీ విద్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

భార్యభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుని జీవించే వారు. వీరి కుటుంబంలో మధ్య చిచ్చు పెట్టింది. ఇటీవల శివ మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య ఉమ అతడిని తాగుడు మానేయమని చెబుతూ వస్తోంది. అయితే శివ శనివారం రాత్రి కూడా మద్యం తాగి రావడంతో ఉమా మనస్థాపానికి గురయ్యింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం శివ పనికి వెళ్ళాక.. ఉమ అన్నంలో పురుగుల మందు కలిపింది. ముందు కూతుర్లకు పెట్టింది. ఆ తర్వాత ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

తిన్న తర్వాత గోవిందు తండా గ్రామంలోని తన తండ్రికి ఫోన్ చేసి పాము విషం తిన్న సంగతి చెప్పింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వారిని వెంటనే కారేపల్లి పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగా ఉమా, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమం ఉంది. దీంతో వీరిని హైదరాబాద్ కు తరలించారు. 

ఇదిలా ఉండగా, తమిళనాడులో ఓ ప్రైవేట్ స్కూల్ లో ఒక బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు, ఆస్తుల విధ్వంసానికి దారి తీసింది. తమిళనాడులోని కాళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో శ్రీమతి(17) అనే బాలిక ప్లస్ -2 చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజులుగా కుటుంబీకులు, బంధువులు అక్కడే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. 

నాకు పెద్ద స‌పోర్ట‌ర్ ఈ జిందం స‌త్త‌మ్మ‌నే.. కేసీఆర్ వీరాభిమాని ఫొటోలు ట్వీట్ చేసిన కేటీఆర్

కాగా, ఆదివారం గుర్తుతెలియని వందలాది యువకులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి చొరబడి విధ్వంసానికి దిగారు. వీరిని ఆపే క్రమంలోడీఐజీ పాండియన్ తో పాటు 20 మంది పోలీసులు గాయపడ్డారు. మంత్రులు, డీజీపి, హోం శాఖ కార్యదర్శి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తమిళనాడులోని కళ్లకురిచ్చి సమీపంలోని చిన్న సేలం వద్ద ఉన్న ప్రైవేట్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇద్దరు ఉపాధ్యాయులు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నోట్‌ లో రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

ఉపాధ్యాయులు ఈ ఆరోపణలను ఖండించగా, విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కళ్లకురిచ్చి-సేలం రహదారిని దిగ్బంధించి, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం హాస్టల్ భవనం వాచ్‌మెన్ నేలపై పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించి పాఠశాల అధికారులకు సమాచారం అందించాడు. వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.