తన నియోజికవర్గానికి చెందిన ఓ మహిళ ఫొటోలను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆమె సీఎం కేసీఆర్ వీరాభిమాని అని, తనకు ఎంతో సపోర్ట్ గా ఉంటారని ఆమెతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అభిమాని, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన జిందం సత్తమ్మ ఫొటోలను మంత్రి కేటీఆర్ తన పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ షేర్ చేశారు. ఆమెను అందరికీ పరిచయం చేస్తూ పలు సందర్భంలో ఆమెతో ఉన్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.
Scroll to load tweet…
‘‘ నా జిల్లా (సిరిసిల్ల)కు చెందిన ఒక స్పెషల్ టీఆర్ఎస్ సపోర్టర్ ని, కేసీఆర్ హార్డ్ కోర్ అభిమానిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆమె జిందం సత్తెమ్మ. ఆమె తెలంగాణ ఆందోళనలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటున్నారు. అలాంటి షరతులు లేని ఆప్యాయత, మద్దతు ఎంతో అమూల్యమైనది. ’’ అంటూ ఆమె గురించి రాశారు. ఉద్యమ సమయంలో, ఇంకా పలు సందర్భాల్లో ఆమెతో తను తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు.
