మెదక్ లో ఓ తల్లీకూతురు హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. వీరి హత్యలకు వివాహేతర సంబంధమే కారణం అని తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

మెదక్ : Medak districtలో దారుణం జరిగింది. ఇటీవల జరిగిన తల్లి కూతురు murder caseను విచారణ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. దానికి సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా పోలీసులు మీడియాకు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం…జిల్లాలోని చేగుంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన శంభుని యాదమ్మ, తన కూతురు సంతోష కలిసి ఏప్రిల్ 10న చేగుంటకు వెళ్లారు. అయితే, ఆ తరువాత వారు ఇంటికి తిరిగి ఇంటికి రాలేదు. సన్నిహితులు, బంధువులను సంప్రదించినా వారి ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో యాదమ్మ భర్త దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాడు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. 

ఈ క్రమంలోనే వడియారం అటవీ ప్రాంతంలో రెండు గుర్తుతెలియని డెడ్ బాడీ లు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. ఆ డెడ్ బాడీ లను యాదమ్మ, సంతోషగా గుర్తించారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వడియారం గ్రామానికి చెందిన నగేష్ పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో నగేష్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆ ఇద్దరు తల్లీకూతుళ్లను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

హత్యకు గల కారణాలు… 
కొన్నాళ్ళ క్రితం నగేష్ కు తల్లీకూతుళ్లతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా తల్లీకూతుళ్లతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇప్పుడు ఈ క్రమంలోవారు నగేష్ ను డబ్బులు ఇవ్వాలని వేధించసాగారు. అంతేకాదు తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నగేష్ పై కేసు కూడా పెడతామని బెదిరించారు. అయితే నగేష్ మాత్రం ఎలాగైనా వారి పీడ తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ప్లాన్ ప్రకారం యాదమ్మతో పాటు ఆమె కుమార్తె సంతోషను వడియారం.. అటవీ ప్రాంతానికి రావలసిందిగా కోరాడు. తల్లీకూతుళ్ళు అక్కడికి వెళ్లి నిందితుడితో కలిసి మద్యం సేవించారు. ఇక ఆ మత్తులోనే నగేష్ తల్లీకూతుళ్లను గొంతు నులిమి హత్య చేశాడు. విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, తూర్పు గోదావరి జిల్లాలో Village Volunteer గా పని చేస్తూ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఓ minor girlతో పరిచయం పెంచుకున్న యువకుడు ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో ఆమెపై molestationకి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలి లంకకు చెందిన గ్రామ వాళ్లంటే బూసి సతీష్ (23) అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నమ్మించి అఘాయిత్యానికి తెగబడ్డాడు.

ఆ తరువాత ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించాడు. ఆదివారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సతీష్ పై పోక్సో కింద కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ ఆర్.కె.శుభ శేఖర్ తెలిపారు.