అనుకోకుండా ఓ కోతి ఇంట్లోకి దూరిందనుకోండి.. ఏం చేస్తుంది..? ఏ పండ్లో, కూరగాయాలో.. లేదంటే అన్నం గిన్నెల్లో ఎత్తుకెళ్తుంది కదా. కానీ ఒకరింట్లో మాత్రం బంగారం ఎత్తుకెళ్లింది. కోతులు ఇంట్లోకి దూరి బంగారు నగలను ఎత్తుకెళ్లాయి. ఈ సంఘటన కొమరంభీం జిల్లా రెబ్బన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Also Read యువతిని నిర్భందించి అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం మధ్యాహ్నం కోతులు చొరబడి వంట గదిలో ఉన్న పప్పు డబ్బాలతో ఉడాయించాయి. అయితే.. ఆ డబ్బాలో సదరు ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కూతురుకు చెందిన తులం బంగారం చైన్‌ ఉన్నాయి. 

స్థానికుల సాయంతో ఆ కోతులు ఉన్న ప్రాంతాలన్నీ గాలించారట. కానీ.. ఆ బంగారం ఉన్న డబ్బా ఎత్తుకెళ్లిన కోతీ దొరకలేదు.. దాని చేతిలోని డబ్బాలు కూడా దొరకక పోవడం గమనార్హం. దీంతో.. బంగారం పోయిందని ఆ కుటుంబసభ్యులు లబోదిబోమన్నారట.