మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు  ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను  కోర్టులో హాజరు పర్చనున్నారు పోలీసులు .,ఈ  ముగ్గురికి శంషాబాద్  పోలీస్ స్టేషన్  లోనే  వైద్య పరీక్షలు పూర్తి  చేశారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని ఏసీబీ కోర్టులో హజరుపర్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు గురువారంనాడు పూర్తి చేశారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో నిందితులను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టారనే అంశానికి సంబంధించి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, సింహయాజీ,నందులపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు నిన్న రాత్రి నుండి విచారిస్తున్నారు.శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ ముగ్గురిని విచారిస్తున్నారు. పార్టీ మారితే డబ్బులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టారని పైలెట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు నిన్న రాత్రి నుండి ప్రగతిభవన్ లో ఉన్నారు. ఎవరెవరు టచ్ లోకి వచ్చారనే విషయమై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల నుండి సమాచారం తీసుకున్నారని ప్రచారం సాగుతుంది. 

మొయినాబాద్ ఫాంహౌస్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాంహౌస్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీని కూడ పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ప్రలోభాల అంశానికి సంబంధించి ముగ్గురు నిందితుల నుండి ఏ రకమైన సమాచారం సేకరించారనేది అంశంపై పోలీసులు మీడియాకు వివరించే అవకాశం ఉంది. 

తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసిందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రగతి భవన్ వేదికగా ఈ డ్రామా నడిచిందని బీజేపీ ఆరోపించింది. ఈ అంశానికి సంబంధించి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. 

also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: స్పెషల్ ఇన్వేస్టిగేషన్‌కై హైకోర్టులో బీజేపీ పిటిషన్

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే విషయమై ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.