ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: బీజేపీ నేత బీఎల్ సంతోష్ కి మరో సారి సిట్ నోటీసులు

మొయినాబాద్  ఫాం  హౌస్  ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో  బీజేపీ  అగ్రనేత  బీఎల్ సంతోష్ కు హైద్రాబాద్  పోలీసులు  నోటీసులు పంపారు. ఈ నెల 26న లేదా  28న  విచారణకు రావాలని ఆ నోటీసుల్లో  సిట్  కోరింది. 

Moinabad  Farm  house Case:SIT  Issues  Notice  To  BJP  Leader  BL  Santosh

హైదరాబాద్: మొయినాబాద్  ఫాం  హౌస్ లో  ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  బీజేపీ  అగ్రనేత  బీఎల్  సంతోష్ కు  హైద్రాబాద్  పోలీసులు  నోటీసులు  పంపారు.ఈ  నెల  26న లేదా  28వ  తేదీన  విచారణకు  రావాలని  నోటీసులు  జారీ చేశారు.బీఎల్  సంతోష్ కు  మరోసారి  నోటీసులు పంపాలని తెలంగాణ  హైకోర్టు  నిన్న  ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు  మరోసారి బీఎల్ సంతోష్ కు  సిట్  అధికారులు  ఇవాళ  నోటీసులు  జారీ చేశారు.

మొయినాబాద్  ఫాం  హౌస్ కేసులో  బీజేపీ  అగ్రనేత  బీఎల్  సంతోష్ కు  రెండు  రోజుల  క్రితమే  సిట్ నోటీసులు జారీ  చేసింది. న్యూఢిల్లీలోని  బీజేపీ  కేంద్ర  కార్యాలయంలో  ఢిల్లీ  పోలీసుల సహాయంతో  తెలంగాణ పోలీసులు  నోటీసులు  జారీ  చేశారు.  గుజరాత్  రాష్ట్ర అసెంబ్లీ  ఎన్నికల్లో  బిజీగా  ఉన్నందున  విచారణకు  రావడానికి  సమయం  కోరినట్టుగా  సంతోష్  సిట్ కు  లేఖ రాశాడు.  అయితే ఈ నోటీసు కంటే  ముందే  ఈ నెల  21న  విచారణకు  రావాలని  బీఎల్  సంతోష్ కి  సిట్  నోటీసులు  పంపింది.  అయితే  విచారణకు  బీఎల్  సంతోష్  హాజరు కాలేదు.

ఎమ్మెల్యేలకు  ప్రలోభాల  కేసును  నిన్న  విచారించిన  తెలంగాణ  హైకోర్టు  కీలక  ఆదేశాలు  జారీ చేసింది.  బీజేపీ  అగ్రనేత  బీఎల్ సంతోష్ కు  మరోసారి  41ఏ సీఆర్‌పీసీ కింద  నోటీసులు  జారీ  చేయాలని ఆదేశించింది.సహజ  న్యాయసూత్రాలకు  భిన్నంగా  వ్యవహరించవద్దని కూడ సిట్ కు  సూచించింది  తెలంగాణ  హైకోర్టు. దీంతో  సిట్ అధికారులు   మరోసారి  నోటీసులు  జారీ చేశారు.  ఇదిలా  ఉంటే  ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో  బీఎల్  సంతోష్  పై మొయినాబాద్  పోలీస్ స్టేషన్  లో పోలీసులు  కేసు నమోదు  చేసినట్టుగా  ప్రముఖ  తెలుగు  న్యూస్ చానెల్  టీవీ 9 కథనం  ప్రసారం చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios