Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు:ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టివేత

ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో  ముగ్గురు నిందితులను 10  రోజుల పాటు  కస్టడీకి  ఇవ్వాలని సిట్  దాఖలు  చేసిన పిటిషన్ ను  ఏసీబీ  కోర్టు  గురువారంనాడు  కొట్టివేసింది. 

moinabad  fam house  case: ACB  Court  Quashes  Accused  Custody  Petiton
Author
First Published Nov 24, 2022, 3:30 PM IST

హైదరాబాద్: ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసులో ముగ్గురు  నిందితుల  కస్టడీకి ఇవ్వాలని  సిట్  దాఖలు  చేసిన  పిటిషన్ ను  ఏసీబీ  కోర్టు గురువారంనాడు  కొట్టేసింది.  నిందితులను  10  రోజులపాటు  కస్టడీకి  ఇవ్వాలని రెండు  రోజుల క్రితం  ఏసీబీ కోర్టులో  సిట్  పిటిషన్  దాఖలు  చేసింది.

గతంలో  రెండు  రోజులపాటు  నిందితులను  విచారించిన అంశాన్ని నిందితు  తరపున  న్యాయవాదులు  కోర్టు  దృష్టికి తీసుకు వచ్చారు.  అయితే  మరింత  సమాచారం తీసుకురావాల్సి  ఉన్నందున  కస్టడీకి ఇవ్వాలని సిట్  తరపు న్యాయవాది  కోర్టులో  వాదనలు  విన్పించారు.  

రెండు  రోజుల  విచారణలో  పూర్తి  సమాచారం  రానందున  కస్టడీకి  ఇవ్వాలని  సిట్  తరపు న్యాయవాది  కోరారు. అయితే  గతంలో విచారించినందున  పది  రోజుల  కస్టడీ  కోరుతూ  సిట్  దాఖలు  చేసిన పిటిషన్ ను  కోర్టు  తోసిపుచ్చింది.  ఈ   మేరకు సిట్  దాఖలు  చేసిన పిటిషన్ ను  కొట్టేసింది. ఇదిలా  ఉంటే  ఈ  ముగ్గురు నిందితుల  బెయిల్  పిటిషన్లు  గతంలోనే  ఏసీబీ  కోర్టు  తోసిపుచ్చింది. దీంతో  ఈ   ముగ్గురు సుప్రీంకోర్టును  ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా  ఈ  విషయమై  విచారించింది.  హైకోర్టులోనే  బెయిల్  పిటిషన్ ను  దాఖలు  చేసుకోవాలని సూచించింది. ఒకటి  రెండు రోజుల్లో  నిందితులు  హైకోర్టులో  బెయిల్  పిటిషన్  దాఖలు  చేసే  అవకాశం ఉంది. 

ఈ  ఏడాది  అక్టోబర్  26న  మొయినాబాద్  ఫాం  హౌస్  లో నలుగురు  ఎమ్మెల్యేలను ప్రలోభాలకు  గురి  చేస్తున్నారనే  ఆరోపణలతో  రామచంద్రభారతి, సింహయాజీ,  నందకుమార్ లు అరెస్టయ్యారు.   తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్  రోహిత్  రెడ్డి  ఫిర్యాదు  మేరకు  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  అచ్చంపేట  ఎమ్మెల్యే  గువ్వల  బాలరాజు , కొల్లాపూర్  ఎమ్మెల్యే  బీరం  హర్షవర్ధన్ రెడ్డి , పినపాక  ఎమ్మెల్యే  రేగా  కాంతారావు, తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్  రోహిత్ రెడ్డిలను  ముగ్గురు  నిందితులు  ప్రలోభాలకు  గురి చేశారని కేసు నమోదైంది.  

పైలెట్ రోహిత్ రెడ్డి  ఫిర్యాదు మేరకు  ఈ  ముగ్గురు నిందితులను  మొయినాబాద్  పోలీసులు గత నెల  26వ  తేదీన అరెస్ట్ చేశారు.  నిందితులు  ప్రస్తుతం  జైల్లో  ఉన్నారు.  ఈ  కేసు  విచారణ కోసం  తెలంగాణ ప్రభుత్వం  సిట్ ను  ఏర్పాటు  చేసింది.  ఈ  కేసుతో  సంబంధాలున్నాయనే  అనుమానంతో  సిట్  పలువురికి నోటీసులు  జారీ  చేసింది.  అంతేకాదు  కొందరిని  విచారించింది.  మరికొందరికి కూడా సిట్  నోటీసులు  జారీ  చేసింది.  ఈ  కేసులో  బీఎల్  సంతోష్ , తుషార్ లకు  కూడా సిట్  ఇవాళ  నోటీసులు  జారీ  చేసింది.  

also  read:అడ్వకేట్ ప్రతాప్ ను అరెస్ట్ చేయవద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశం

ఇదే  కేసులో  ఏపీకి  చెందిన  నర్సాపురం  ఎంపీ రఘురామకృష్ణంరాజు కు  కూడా  సిట్  ఇవాళ నోటీసులు  జారీ  చేసింది. ఇదే  కేసులో  కేరళకు  చెందిన జగ్గుస్వామికి  సిట్  లుకౌట్  నోటీసులు  జారీ చేసిన విషయం  తెలిసిందే. బీజేపీ  అగ్రనేత  బీఎల్  సంతోష్, తుషార్ , జగ్గుస్వామిలపై  మొయినాబాద్  పోలీసులు  కేసు నమోదు  చేశారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios