Asianet News TeluguAsianet News Telugu

అడ్వకేట్ ప్రతాప్ ను అరెస్ట్ చేయవద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశం

తదుపరి ఆదేశాలు  వచ్చే వరకు  అడ్వకేట్  ప్రతాప్ ను  అరెస్ట్ చేయవద్దని  తెలంగాణ  హైకోర్టు  ఆదేశించింది. అడ్వకేట్  ప్రతాప్  దాఖలు  చేసిన పిటిషన్ ను  ఇవాళ  హైకోర్టు  విచారించింది.

 moinabad farm house  case:Telangana  High  court  orders  to  not  arrest  advocate Pratap
Author
First Published Nov 24, 2022, 2:53 PM IST

హైదరాబాద్: తదుపరి  ఆదేశాలు  జారీ  చేసేవరకు  అడ్వకేట్  ప్రతాప్ ను  అరెస్ట్ చేయవద్దని  తెలంగాణ  హైకోర్టు  గురువారంనాడు ఆదేశించింది. రేపు సిట్  విచారణకు అడ్వకేట్  ప్రతాప్‌ హాజరు కావాల్సింది. ఈ  మేరకు  సిట్  నోటీసులు  జారీ  చేసింది.  ఈ  నోటీసులను  అడ్వకేట్  ప్రతాప్  హైకోర్టులో  సవాల్ లో చేశారు.  ఈ  పిటిషన్ పై  విచారణ జరిగింది. నిందితుడు, అనుమానితుడు  కానప్పటికీ  అడ్వకేట్  ప్రతాప్ ను  విచారణకు  రావాలని సిట్  నోటీసులు జారీ  చేసిందని  హైకోర్టు దృష్టికి   ఆయన  తరపు న్యాయవాది  తీసుకు వచ్చారు. కారణాలున్నందునే  ప్రతాప్ నోటీసులు అందుకున్నారని  సిట్  తరపు  న్యాయవాది  హైకోర్టుకు  తెలిపారు.  ఇరు  వర్గాల  వాదలను  విన్న  హైకోర్టు  తదుపరి ఆదేశాలు  వచ్చేవరకు  ప్రతాప్ ను  అరెస్ట్  చేయవద్దని ఆదేశాలు  జారీ  చేసింది. 

ఈ  ఏడాది  అక్టోబర్  26న  మొయినాబాద్  ఫాం  హౌస్  లో నలుగురు  ఎమ్మెల్యేలను ప్రలోభాలకు  గురి  చేస్తున్నారనే  ఆరోపణలతో  రామచంద్రభారతి, సింహయాజీ,  నందకుమార్ లు అరెస్టయ్యారు.   తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్  రోహిత్  రెడ్డి  ఫిర్యాదు  మేరకు  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  అచ్చంపేట  ఎమ్మెల్యే  గువ్వల  బాలరాజు , కొల్లాపూర్  ఎమ్మెల్యే  బీరం  హర్షవర్ధన్ రెడ్డి , పినపాక  ఎమ్మెల్యే  రేగా  కాంతారావు, తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్  రోహిత్ రెడ్డిలను  ముగ్గురు  నిందితులు  ప్రలోభాలకు  గురి చేశారని కేసు నమోదైంది.  

also  read:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి సిట్ నోటీసు

పైలెట్ రోహిత్ రెడ్డి  ఫిర్యాదు మేరకు  ఈ  ముగ్గురు నిందితులను  మొయినాబాద్  పోలీసులు గత నెల  26వ  తేదీన అరెస్ట్ చేశారు.  నిందితులు  ప్రస్తుతం  జైల్లో  ఉన్నారు.  ఈ  కేసు  విచారణ కోసం  తెలంగాణ ప్రభుత్వం  సిట్ ను  ఏర్పాటు  చేసింది.  ఈ  కేసుతో  సంబంధాలున్నాయనే  అనుమానంతో  సిట్  పలువురికి నోటీసులు  జారీ  చేసింది.  అంతేకాదు  కొందరిని  విచారించింది.  మరికొందరికి కూడా సిట్  నోటీసులు  జారీ  చేసింది.  ఈ  కేసులో  బీఎల్  సంతోష్ , తుషార్ లకు  కూడా సిట్  ఇవాళ  నోటీసులు  జారీ  చేసింది.   ఇదే  కేసులో  ఏపీకి  చెందిన  నర్సాపురం  ఎంపీ రఘురామకృష్ణంరాజు కు  కూడా  సిట్  ఇవాళ నోటీసులు  జారీ  చేసింది. ఇదే  కేసులో  కేరళకు  చెందిన జగ్గుస్వామికి  సిట్  లుకౌట్  నోటీసులు  జారీ చేసిన విషయం  తెలిసిందే. బీజేపీ  అగ్రనేత  బీఎల్  సంతోష్, తుషార్ , జగ్గుస్వామిలపై  మొయినాబాద్  పోలీసులు  కేసు నమోదు  చేశారు. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios