హైదరాబాద్ చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పాపిరెడ్డి నగర్‌ సమీపంలో ఎంఎంటీఎస్ ఢీకొని ఇద్దరు యువతి యువకులు మరణించారు. మృతులను సోనీ, మనోహర్‌లుగా గుర్తించారు పోలీసులు. వీరిద్దరికి కొద్దిరోజుల క్రితమే వీరికి వివాహం నిశ్చితార్ధమైంది, ఫిబ్రవరిలో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయించారు.

దీనిలో భాగంగా పెళ్లి షాపింగ్ కోసం చందానగర్ అండర్‌పాస్ చెత్తాచెదారంతో నిండిపోవడంతో కింది నుంచి వెళ్లడం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ జంట పట్టాల పైనుంచి అవతల పక్కనున్న రోడ్డుమీదకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఎంఎంటీఎస్ ఢీకొట్టడంతో వీరిద్దరు అక్కడికక్కడే మరణించారు.

దీనిపై పాపిరెడ్డినగర్‌కు చెందిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అండర్‌పాస్ వద్ద చెత్తను తొలగించివుంటే ఈ దారుణం జరిగేది కాదని వారు వాదిస్తున్నారు.

దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజుల్లో వివాహం ఉండటంతో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలై ఉన్న ఇరు కుటుంబాల్లో సోనీ, మనోహర్‌ల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. 

Also Read:

మేం పవర్‌లోకి వస్తే.. నీకు తిప్పలే: ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

పెళ్లి పేరిట యువతికి మోసం: ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డికి క్యాట్‌లో ఊరట

టీపీసీసీ చీఫ్ పదవి కోసం ఏకం అవుతున్న రెడ్డి సామాజిక వర్గం నేతలు