Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి పేరిట యువతికి మోసం: ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డికి క్యాట్‌లో ఊరట

పెళ్లి పేరిట యువతిని మోసం చేసి సస్పెన్షన్‌కు గురైన ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డి క్యాట్‌లో ఊరట లభించింది. అతనిని ఐపీఎస్ ట్రైనింగ్‌కు అనుమతించాలని ట్రిబ్యునల్ కేంద్ర హోంశాఖను ఆదేశించింది

central administrative tribunal verdict on trainee ips maheshwar reddy suspension
Author
Hyderabad, First Published Dec 24, 2019, 5:19 PM IST

పెళ్లి పేరిట యువతిని మోసం చేసి సస్పెన్షన్‌కు గురైన ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డి క్యాట్‌లో ఊరట లభించింది. అతనిని ఐపీఎస్ ట్రైనింగ్‌కు అనుమతించాలని ట్రిబ్యునల్ కేంద్ర హోంశాఖను ఆదేశించింది. తుది ఉత్తర్వులకు లోబడి మహేశ్వర్‌రెడ్డి నియామకం ఉంటుందని ఈ సందర్భంగా క్యాట్ అభిప్రాయపడింది. కాగా.. 

ప్రేమ, పెళ్లి అనంతరం మోసం కేసులో ఆరోపనలు ఎదుర్కొంటున్నట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ వేటు వేసింది. ట్రైనింగ్ లో ఉన్న మహేశ్వర్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Also Read:యువతిని మోసం చేసిన ట్రైనీ ఐపీఎస్: కేంద్ర హోంశాఖ వేటు

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సస్పెన్షన్ లోనే ఉంటారంటూ స్పష్టం చేసింది. ఇకపోతే మహేశ్వర్ రెడ్డి తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఐపీఎస్ కు సెలక్ట్ అయిన తర్వాత తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది భావన. 

ఓయూలో చదువుతున్నప్పుడు 2009 నుంచి తాను మహేశ్వర్ రెడ్డి ప్రేమించుకున్నామని భావన స్పష్టం చేశారు. అయితే 2018లో స్నేహితుల సహకారంతో కీసర రిజిస్ట్రార్ ఆఫీస్ లో వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

పెళ్లి గురించి ఇంట్లో వారికి చెప్పమంటే సెటిలయ్యాక చెప్తా అని మహేశ్వర్ రెడ్డి చెప్పడంతో తాను కూడా సరే అని అన్నట్లు చెప్పుకొచ్చారు. ఏడాదిన్నరపాటు తాము కాపురం కూడా చేసినట్లు చెప్పుకొచ్చారు.

Also Read:ట్రైనీ ఐపిఎస్ మహేష్ రెడ్డిపై యువతి ఫిర్యాదు, కేసు నమోదు

అయితే ఐపీఎస్ కు ఎంపికైన తర్వాత ఎక్కువ కట్నం వస్తుందన్న కారణంతో మొహం చాటేస్తున్నాడంటూ భావన ఆరోపించారు. మీది తక్కువ కులం కాబట్టి ఇంట్లో ఒప్పుకోరని మహేశ్వర్ రెడ్డి చెబుతున్నాడంటూ వాపోయింది. 

తనను పెళ్లి చేసుకుని మరో పెళ్లికి సిద్దమవుతున్న మహేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని భావన జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. భావన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది హోంశాఖ. 

Follow Us:
Download App:
  • android
  • ios