Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ షర్మిలపై కల్వకుంట్ల కవిత ట్వీట్.. తాము వదిలిన బాణం అంటూ బీజేపీకి చురకలు...

షర్మిల బీజేపీ వదిలిన బాణం అని అర్థం వచ్చేలా ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. షర్మిల మంగళవారం ప్రగతిభవన్ ముట్టడికి బయల్దేరడంతో అరెస్టై, బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే.

MLC Kalvakuntla Kavitha Satirical Tweet on YS Sharmila
Author
First Published Nov 30, 2022, 12:01 PM IST

హైదరాబాద్ : ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించి.. అరెస్టై, బెయిల్ మీద బైటికి వచ్చిన వైయస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిలపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలిసారిగా స్పందించారు. ఆమె మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘తాము వదిలిన  బాణం. తానా అంటే తందానా అంటున్న తామరపూలు’’ అంటూ బీజేపీని, షర్మిలను ఉద్దేశిస్తూ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. వైఎస్సార్టీపీ బీజేపీ అనుకూల పార్టీ అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.  

కాగా, మంగళవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన షర్మిల అరెస్టు ఆ తర్వాత బెయిలు అంత నాటకీయ పరిణామాల మధ్య  జరిగిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నవంబర్ 28 నాడు నర్సంపేటలో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. షర్మిలను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులకు, వైయస్సార్ టీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆ తర్వాత షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. 

షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. న్యాయమే గెలిచిందన్న విజయమ్మ

ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఆదివారంనాడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీద షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలు చేసిన షర్మిల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలం లింగగిరిలో షర్మిల బస చేసిన బస్సును టిఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేశాయి. బస్సు మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో సోమవారం ఉదయం నుండి నర్సంపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిని నివారించడానికి పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. తర్వాత అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్లోని లోటస్ పాండ్ కు తరలించారు.

మంగళవారం మధ్యాహ్నం షర్మిల పోలీసుల కళ్లుగప్పి లోటస్ పాండ్ నుంచి బయటికి వచ్చారు. దెబ్బతిన్న బస్సును తీసుకుని తన కారులో ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పోలీసులు తన పాదయాత్రను అడ్డుకోవడంపై నిరసన  వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే షర్మిలను సోమాజిగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో సోమాజిగూడా లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీస్ ఉన్నతాధికారులు చెరువుల దగ్గరికి చేరుకొని ఆమెను అక్కడి నుండి వెళ్లిపోవాల్సిందిగా కోరారు.  అయితే షర్మిల మాత్రం కారు డోరు లాక్ చేసుకుని అక్కడే ఉండిపోయారు. 
అయితే కారులో నుండి షర్మిల ఎంత కిందికి దిగడానికి ఒప్పుకోకపోవడంతో.. పోలీసులు కారుతో పాటే ఆమెను స్టేషన్కు తరలించారు. 

ఆ తర్వాత రాత్రి ఏడు గంటల ప్రాంతంలో వైఎస్ షర్మిల అరెస్ట్ పై పోలీసులు ప్రకటన చేశారు. పంజాగుట్టలో నమోదైన కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు సమాచారం అందించారు.  షర్మిలతోపాటు ఐదుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, నాంపల్లి కోర్టు వైఎస్ఆర్ టీపీ అధినేత వైయస్ షర్మిల కు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై ఆమెతో పాటు మరో ఐదుగురు వ్యక్తులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios