Asianet News TeluguAsianet News Telugu

MLC Elections : ఆదిలాబాద్ షాక్.. బీజేపీ పోటీ చేయాల్సిందన్న ఈటెల రాజేందర్..

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీలో నిలిచి ఏకగ్రీవాలు కాకుండా చూడాల్సిందని ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం పార్టీ పదాధికారుల సమావేశం సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. 

mlc eletions 2021, etela rajender comments on adilabad results
Author
Hyderabad, First Published Nov 27, 2021, 12:05 PM IST

హైదరాబాద్ : Quota of local bodiesలో శాసనమండలి ఎన్నికలు బీజేపీలో వేడి రాజేస్తున్నాయి. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో అభ్యర్థులు గెలిపించుకునే బలం లేనందున పోటీకి దూరంగా ఉండాలని State leadership నిర్ణయించగా ఆ పార్టీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే Etela Rajender మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. 

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీలో నిలిచి ఏకగ్రీవాలు కాకుండా చూడాల్సిందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం పార్టీ పదాధికారుల సమావేశం సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. Karimnagar జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. 

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ అక్కడ గెలవబోతున్నారన్నారు. ఆదిలాబాద్ లోనూ తానే స్వతంత్ర అభ్యర్థిని పోటీలో నిలిపినట్లు తెలిపారు. ఈ రెండు చోట్లా తాను అభ్యర్థులను గెలిపించుకుంటానన్నారు. అయితే, అదిలాబాద్ లో ఈటల వ్యూహానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈటెల పోటీకి దింపిన స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి Nomination ఉపసంహరించుకున్నారు. 

రఘునందన్ రావు సైతం....

మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఓ ఇండిపెండెంట్ ను బరిలోకి దింపినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దన్న పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యవహరించారా? అనే అంశం చర్చనీయాంశం అవుతోంది. ముందుగా చెప్పి ఉంటే తాము కూడా జిల్లాల్లో అభ్యర్థులను బరిలో దింపేవారమని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.  పోటీకి దూరంగా ఉండాలన్న అధిష్టానం నిర్ణయంతో తాము వెనక్కు తగ్గామంటున్నారు. ఈ విషయం రాష్ట్ర నాయకత్వం వద్ద తేల్చుకుంటామని చెబుతున్నారు. 

Telangana Local body Elections:ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత, బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల తోపులాట

కాగా, తెలంగాణలో ‘ఆకర్ష్’ రాజకీయాలకు బీజేపీ పదును పెడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, ధాన్యం కొనాలంటూ పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమాలు, హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలుపుతో.. ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని బీజేపీ అంచనా వేస్తోంది. రాజకీయంగానూ మరింత బలోపేతమైనట్లుగా నాయకత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే బీజేపీలోని వివిధ పార్టీలకు చెందిన వేర్వేరు స్థాయి నాయకుల చేరికలపై శుక్రవారం సుదీర్థంగా జరిగిన రాష్ట్ర పదాధికారు భేటీలో చర్చించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు, నియోజకవర్గాల్లో పట్టున్నవారిని, మంచి ఇమేజ్ ఉన్న వారిని, బీజేపీ అభివృద్ధికి దోహదపడే వారిని చేర్చుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

గతేడాది కాంలో బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద సాగించిన పోరాటాలపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే మరింత ఉదృతమైన పోరాటాలకు కార్యాచరణ రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, డీకే అరుణ, కె. లక్ష్మణ్, విజయశాంతి, రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్, పొంగులేటి సుధాకరరెడ్డి పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios