Asianet News TeluguAsianet News Telugu

Telangana Local body Elections:ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత, బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల తోపులాట


స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉప సంహరణ సమయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. ఇండిపెండెంట్ అభ్యర్ధి నామినేషన్ విషయమై ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. 

Telangana Local body Elections:Tension Prevails At Adilabad Collectorate After TRS, Bjp protest
Author
Adilabad, First Published Nov 26, 2021, 5:35 PM IST


ఆదిలాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉప సంహరణ విషయమై  శుక్రవారం నాడు  ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఆదిలాబాద్ జిల్లా నుండి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్ధి Pushpa rani నామినేషన్ ఉప సంహరించుకోలేదు. అయితే పుష్పరాణి Nomination ను  ప్రతిపాదకుడి పేరుతో వచ్చిన ఓ వ్యక్తి పుష్పరాణి నామినేషన్ ఉప సంహరణకు ప్రయత్నించినట్టుగా తెలియడంతో  Bjp శ్రేణులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు.

ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 24 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే వీరిలో 22 మంది  తమ నామినేషన్లను  ఉప సంహరించుకొన్నారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్ధి పుష్పరాణి మాత్రం  తన నామినేషన్ ను ఉప సంహరించుకోలేదు. అయితే పుష్పరాణి నామినేషన్  దాఖలు సమయంలో ఆమెకు ప్రతిపాదకుడిగా సంపత్ సంతకం చేశాడని అతడితో ఈ నామినేషన్ పత్రాలను ఉపసంహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం రావడంతో బీజేపీ కార్యకర్తలు అతడిని పట్టుకొన్నారు. బీజేపీ శ్రేణులు పట్టుకొన్న వ్యక్తి సంపత్  కూడా కాదని తేల్చారు.  ఈ సమయంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. రెండు పార్టీల కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేసుకొన్నారు. రెండు పార్టీల మధ్య తోపులాట జరిగింది.  దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.  ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలను అదుపులోకి తీసుకొన్నారు

also read:Telangana Local Body Elections: ఆరు స్థానాలకు డిసెంబర్ 10న ఎన్నికలు

 ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో డిసెంబర్ 10న ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణ రాష్ట్రంలోని  12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం  ఈ నెల 9వ తేదీన షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 16న Telangana Local Body Elections  ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.   12 స్థానాల్లో ఆరు స్థానాలను  Trs ఏకగ్రీవంగా గెలుచుకొంది. మిగిలిన ఆరు స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు , నిజామాబాద్, వరంగల్ , మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బలం ఉంది. ఈ ఆరు స్థానాలను ఆ పార్టీ గెలుపొందనుంది. అయితే కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీకి చెందిన మాజీ మేయర్  బరిలో నిలవడంతో ఆ పార్టీ తన అభ్యర్ధులను  క్యాంప్ నకు తరలించింది.  మరోవైపు  కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లాలో బలం ఉంది. గతంలో ఈ స్థానం నుండి కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరకు ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios