Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా: ఏపీలో 3, తెలంగాణలో 6 స్థానాల భర్తీ... నవంబర్ 9న నోటిఫికేషన్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల (mlc elections) షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 3, తెలంగాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. నవంబర్ 9న నోటిఫికేషన్ వెలువడనుంది. 

mlc election schedule release for telugu states
Author
Hyderabad, First Published Oct 31, 2021, 11:19 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల (mlc elections) షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 3, తెలంగాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. నవంబర్ 9న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 16 కాగా.. 29 పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. ఏపీలో మే 31, తెలంగాణలో జూన్ 3న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. 

కరోనా (coronavirus) వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించవద్దని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం (telangana govt) ఈ ఏడాది జూలైలో కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ)కి (election commission) లేఖ రాసింది. ఇంతకు ముందే ఓసారి ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా పడ్డాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి (gutta sukender reddy), నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి (kadiyam srihari) , ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీన ముగుసింది. ఈ ఆరుగురు కూడా ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి (telangana legislative council) ఎన్నికయ్యారు. వారి పదవీ కాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గవర్నర్‌ కోటాలో భర్తీ అయిన ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాస్‌ రెడ్డి స్థానం కూడా జూన్ 16న ఖాళీ అయ్యింది. గవర్నర్‌ కోటా కింద భర్తీ చేసే స్థానానికి రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించిన వ్యక్తి ఎమ్మెల్సీ కానున్నారు. ఎమ్మెల్యే కోటా స్థానాలకు శాసన సభ్యుల ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు.

ALso Read:కౌశిక్‌రెడ్డి ఫైల్ నా వద్దే ఉంది, సామాజిక సేవ చేసేవారికే ఎమ్మెల్సీ: ట్విస్టిచ్చిన తమిళిసై

ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి గాను కౌశిక్ రెడ్డి (kousik reddy) పేరును ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర గవర్నర్ వద్దకు పంపింది. అయితే కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్‌లో చేరిన  కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవికి నామినేట్  చేయడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  (tamilisai soundararajan) కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక సేవ చేసిన వారికే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన సిఫారసు ఫైల్ తన వద్దే ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. కౌశిక్ రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె తేల్చి చెప్పారు.  ఈ విషయమై తనకు మరింత సమయం కావాలని ఆమె మీడియాకు తెలిపారు.

మరోవైపు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ పంపిస సిఫారసు పై తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయని కూడా బీజేపీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి ఫైలును గవర్నర్ క్లియర్ చేయలేదనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈ ఫైలుపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios