Asianet News TeluguAsianet News Telugu

కౌశిక్‌రెడ్డి ఫైల్ నా వద్దే ఉంది, సామాజిక సేవ చేసేవారికే ఎమ్మెల్సీ: ట్విస్టిచ్చిన తమిళిసై

కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ ప్రభుత్వం పంపిన ఫైలు తన వద్దే ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. ఇవాళ ఆమె రాజ్‌భవన్ లో మీడియాతో మాట్లాడారు. సామాజిక సేవ చేసినవారికే ఎమ్మెల్సీగా సిఫారసు చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Telangana Governor Tamilisai soundararajan interesting comments on kaushik reddy noimination for council
Author
Hyderabad, First Published Sep 8, 2021, 1:42 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్‌లో చేరిన  కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవికి నామినేట్  చేయడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్  ఇవాళ్టితో రెండేళ్లు పూర్తి చేసుకొంది.ఈ సందర్భంగా రెండేళ్లుగా ఆమె పాల్గొన్న కార్యక్రమాలతో రూపొందించిన టేబుల్ బుక్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 

సామాజిక సేవ చేసిన వారికే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన సిఫారసు ఫైల్ తన వద్దే ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు.కౌశిక్ రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె తేల్చి చెప్పారు.  ఈ విషయమై తనకు మరింత సమయం కావాలని ఆమె మీడియాకు తెలిపారు.

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ పంపిస సిఫారసు పై తెలంగాణ బీజేపీ నేతలు ఇటీవలనే గవర్నర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయని కూడ బీజేపీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి ఫైలును గవర్నర్ క్లియర్ చేయలేదనే ప్రచారం కూడ సాగుతోంది.ఈ విషయమై గవర్నర్ మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి ఫైల్ విషయంలో తన వైఖరిని తేటతేల్లం చేశారు.అయితే ఈ ఫైలుపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios