Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపే నోటిఫికేషన్: ఏపీ, తెలంగాణలో రేసులో వీరే...


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.ఏపీలో మూడు, తెలంగాణలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Mla Quota Mlc Elections  Race For MLC posts hots up In Andhra  and Telangana
Author
Hyderabad, First Published Nov 8, 2021, 3:02 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావాహులు తమ అధినేతలను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

also read:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: టీఆర్ఎస్‌లో పోటీ తీవ్రం, రేసులో కీలక నేతలు

Mla కోటా mlc ఎన్నికలకు Election Commission ఈ ఏడాది అక్టోబర్ 31న షెడ్యూల్ ను విడుదల చేసింది.  Telanganaలోని ఆరు స్థానాలు, Andhra pradeshరాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 9వ తేదీన ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.

తెలంగాణ రాష్ట్రంలోని ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీన ముగిసింది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది. 

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ  మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.చిన్న గోవింద్ రెడ్డి, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీకాలం ఈ ఏడాది మే 31న ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు.తెలంగాణలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు Trsకే దక్కుతాయి.  ఏపీ రాష్ట్రాంలోని అయితే మూడు స్థానాలు వైసీపీ దక్కుతాయి.

తెలంగాణలో రేసులో వీరే

తెలంగాణలో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ తీవ్రంగా ఉంది.  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పలువురు నేతలకు ఎమ్మెల్సీ పదవి విషయమై హామీ ఇచ్చారు.ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తైన వారిలో ఎందరికీ తిరిగి రెన్యూవల్ చేస్తారనే చర్చ టీఆర్ఎస్‌లో సాగుతుంది.

శాసనమండలి ఛైర్మెన్ గా పనిచేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలకు మరోసారి ఎమ్మెల్సీ పదవులను రెన్యువల్ చేస్తారా లేదా అనే చర్చ నెలకొంది. బోడకుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్. ఫరీదుద్దీన్ లు రెండు దఫాలు ఎమ్మెల్సీలుగా పనిచేశారు. సుఖేందర్ రెడ్డిని కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకొంటారనే చర్చ గతంలో సాగింది. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. కానీ ఆయనకు శాసనమండలి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.  మరో వైపు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను పురస్కరించుకొని గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కోసం కేసీఆర్ సర్కార్ సిఫారసు చేసింది. అయితే ఈ సిఫారసును గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఈ సమయంలో పెద్దిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తారనే కేసీఆర్ హామీ ఇచ్చారనే ప్రచారం కూడ సాగింది. అయితే పెద్దిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెడుతారా లేదా  ఇంకా కొత్తవారి పేర్లు తెరమీదికి వస్తాయా అనేది తేలాల్సి ఉంది.

కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి రికమండేషన్ పంపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, బానోతు రామ్మోహన్, తాడూరి శ్రీనివాస్, నాగుల వెంకటేశ్వర్లు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు,  మాజీ ఎంపీ సీతారాం నాయక్,  జి. రవికుమార్ ల పేర్లు విన్పిస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్ లో రేసులో వీరే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలకు జరగనున్నాయి. డీసీ గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖాయమనే ప్రచారం వైసీపీ వర్గాల్లో విన్పిస్తోంది.  మరోవైపు మర్రి రాజశేఖర్ కి ఉమ్మా రెడ్డి వెంకటేశ్వర్లు పేర్లు కూడా విన్పిస్తున్నాయి. అయితే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాజ్యసభ సీటును ఆశిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే దళిత సామాజిక వర్గం నుండి ఒకరికి, మరొక స్థానంలో మహిళకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని వైసీపీ చీఫ్ జగన్ భావిస్తున్నారని ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లో సాగుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios