Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రత పెంపు.. రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు..

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

MLA Pilot Rohith Reddy Security enhanced bullet proof vehicle allotted
Author
First Published Oct 29, 2022, 9:02 AM IST

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పైలెట్ రోహిత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా కేటాయించింది. మొయినాబాద్ ఫామ్‌ హౌస్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోహిత్ రెడ్డి 2+2 భద్రతను కలిగి ఉన్నారు. 

టీఆర్‌ఎస్‌‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రయత్నాలు జరిగాయనే వార్త తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి  తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి‌లు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Also Read:ఎవరెవరు వస్తారో చెప్పండి:పైలెట్ రోహిత్ రెడ్డి, రామచంద్రభారతి ఆడియో సంభాషణ

ఇక, తాజాగా ఈ ఘటనలో నిందితులతో పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడినట్టుగా చెబుతున్న ఫోన్ సంభాషణల ఆఢియోలు రెండు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే ఈ ఆడియోలను ఇప్పటివరకు పోలీసులు ధ్రువీకరించలేదు. అయితే ఆ ఆడియోలలో ఆర్థిక లావాదేవీలు, రోహిత్ రెడ్డితో పాటు ఎంత మంది వస్తారనే అంశాలపై చర్చ సాగింది. ఇద్దరు ఎమ్మెల్యేల  పేర్లు చెప్పాలని రామచంద్రభారతి చెప్పినట్టుగా  ఆడియో సంభాషణలో ఉంది. తన వద్ద నందకుమార్  ఈ అంశం ప్రతిపాదించినట్టుగా రోహిత్ చెప్పారు. సమావేశానికి హైద్రాబాద్  మంచి  ప్లేస్ అని రోహిత్  రెడ్డి  చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల నిఘా ఉందని రోహిత్ రెడ్డి   రామచంద్రభారతి  చెప్పారు.తనతో పాటు  ముగ్గురు  ఎమ్మెల్యేలు  రెడీగా ఉన్నారని రోహిత్ రెడ్డి  రామచంద్రభారతితో అన్నట్టుగా ఆడియోలో  ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios