Asianet News TeluguAsianet News Telugu

ఎవరెవరు వస్తారో చెప్పండి:పైలెట్ రోహిత్ రెడ్డి, రామచంద్రభారతి ఆడియో సంభాషణ

మొయినాబాద్  ఫాంహౌస్  లో ఎమ్మెల్యేల ప్రలోభాల అంశానికి  సంబంధించి  రామచంద్రభారతి పైలెట్ రోహిత్  రెడ్డి మధ్య జరిగిన ఆడియో  సంభాషణను తెలుగు మీడియా ప్రసారం చేసింది. 

Conversation Between TRS MLA Pilot Rohit Reddy and Ramachandra Bharati leaked
Author
First Published Oct 28, 2022, 1:20 PM IST

హైదరాబాద్: మొయినాబాద్  ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల కు  ప్రలోభాల అంశానికి సంబంధించి   రామచంంద్రభారతి పైలెట్  రోహిత్  రెడ్డి మధ్య  జరిగిన ఆడియో సంభాషణను   ప్రముఖ  తెలుగు  న్యూస్  చానెల్  ఎన్టీవీ  శుక్రవారం నాడు ప్రసారం చేసింది.

ఈ నెల 26న  పాంహౌస్ మీటింగ్ కు ముందే ఈ  సంభాషణ  జరిగిందని ఆ కథనం ప్రసారం చేసింది.  ఇద్దరు ఎమ్మెల్యేల  పేర్లు చెప్పాలని రామచంద్రభారతి చెప్పినట్టుగా  ఆడియో సంభాషణలో ఉంది.తన వద్ద నందకుమార్  ఈ అంశం ప్రతిపాదించినట్టుగా చెప్పారు. సమావేశానికి హైద్రాబాద్  మంచి  ప్లేస్ అని రోహిత్  రెడ్డి  చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల నిఘా ఉందని రోహిత్ రెడ్డి   రామచంద్రభారతి  చెప్పారు.తనతో పాటు  ముగ్గురు  ఎమ్మెల్యేలు  రెడీగా ఉన్నారని రోహిత్ రెడ్డి  రామచంద్రభారతితో అన్నట్టుగా ఆడియోలో  ఉంది. 

మా సీఎం చాలా దూకుడుగా ఉంటారు ...ఈ విషయం మీకు  తెలుసు కదా  అని  రోహిత్ రెడ్డి రామచంద్ర భారతితో అన్నట్టుగా ఈ సంభాషణలో ఉంది.ముగ్గురు  ఎమ్మెల్యేలం రెడీగా ఉన్నామని రోహిత్ రెడ్డి రామచంద్రభారతితో చెప్పినట్టుగా ఆడియో సంంభాషణ ఉంది. ఈ  విషయం బయటపడితే తమ పని అయిపోతుందని  రోహిత్  రెడ్డి  వ్యాఖ్యానించారు. అంతేకాదు తాను కూడా ఈ విషయమై  సానుకూలంగానే ఉన్నానని రోహిత్ రెడ్డి రామచంద్రభారతితో  వ్యాఖ్యానించినట్టుగా  ఆడియో సంభాషణ ఉందని  ఈ కథనం తెలిపింది.ఈ అంశాలు పోన్ లో చర్చించడం  మంచిది  కాదని రామచంద్రభారతి  చెప్పారు.

తాను 24 వతేదీ వరకు  బెడ్  రెస్ట్ లో ఉంటానని రామచంద్రభారతి  రోహిత్  రెడ్డితో చెప్పారు. ఈ నెల 25 వ తేదీ తర్వాత కలుద్దామని రామచంద్ర భారతి  చెప్పారు.  నందుతో పాటు  సంతోష్ ను కలిపిస్తామని  రామచంద్రభారతి  చెప్పినట్టుగా ఉంది.మీప్రతిపాదలను ఇవ్వాలని రామచంద్రభారతి పైలెట్  రోహిత్ రెడ్డికి  చెప్పినట్టుగా  ఆడియో  ఉంది.

బీఎల్  సంతోష్ అన్నీ వ్యవహరాలను పరిశీలిస్తారని  చెప్పారు. ఏ నిర్ణయమైనా  సంతోష్ తీసుకుంటారని రామచంద్రభారతి  వ్యాఖ్యానించారు. సంతోష్ తో కలిసి  నెంబర్ 2  వద్దకు వెళ్దామని  రామచంద్రభారతి రోహిత్  రెడ్డికి చెప్పారు.ఒకరిద్దరూ ముందుగా  వస్తే బాగుంటుందని రామచంద్రభారతి అభిప్రాయపడ్డారు. ఈ విషయమైఏమైనా తేడా వచ్చినా  కూడ తాము కవర్ చేస్తామని రోహిత్  రెడ్డితో  రామచంద్ర భారతి  చెప్పినట్టుగా  ఆ కథనం లో ఉంది.కేంద్రం  నుండి  పూర్తి సహకారం  అందిస్తామని కూడా ఆయన ప్రకటించారు.ఈడీ,ఐటీ వరకు భద్రతను చూసుకుంటామని కూడ వ్యాఖ్యానించినట్టుగా  ఈ కథనం తెలిపింది.

also read:ఎమ్మెల్యేల ప్రలోభాలపై ప్రత్యేక బృందంతో విచారణకై బీజేపీ పిటిషన్:రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

అయితే హైద్రాబాద్ లో  కాకుండా మరో చోటకలుద్దామని రామచంద్రభారతి వ్యాఖ్యానించారని ఆ కథనం  వివరించింది.మీరు ఇంకా కొంత క్లారిటీ తీసుకొంటే తాను మరికొందరి కోసం  ప్రయత్నిస్తానని రోహిత్  రెడ్డి  చెప్పారు. తమ ఆర్గనైజింగ్ సెక్రటరీ  సంతోష్ ఏ  నిర్ణయమైనా తీసుకుంటారని ఆయన చెప్పారు.మీరంతా   మా స్కానర్ లో ఉన్నారు, కంగారొద్దని కూడా చెప్పినట్టుగా ఈ కథనం  వివరించింది.ఈ ఆడియో సంభాషణపై  బీజేపీ నేతలు ఎలా  స్పందిస్తారో చూడాలి. మరో వైపు   ఈ ఆడియో సంభాషణ నిజమైందో కాదో అనేది  ఫోరెన్సిక్  నివేదిక తేల్చనుంది. 

మరోవైపు ఈ ముగ్గురికి బీజేపీతో ఏ రకమైన  సంబంధాలున్నాయనే విషయం తేలాల్సి ఉంది. స్థానిక బీజేపీ నేతలు మాత్రం వారితో తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నారు.తమ పార్టీలో చేర్చుకోవాలంటే తాము నేరుగా  సంప్రదింపులు జరుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రకటించారు. ఇలా మధ్యవర్తులను పెట్టుకొని తాము  సంప్రదింపులు చేయబోమని ఆయన ప్రకటించారు.నలుగురు ఎమ్మెల్యేలను తమ  పార్టీలో చేర్చుకొంటే  ప్రభుత్వం  కూలిపోతుందా అని  ప్రశ్నించారు.

.

Follow Us:
Download App:
  • android
  • ios