Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హరీశ్ రావు జైలుకే.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా  మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మరోసారి మంత్రి హరీశ్ పైన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. 

MLA Mynampally Hanumantha Rao made serious comments on Minister Harish Rao KRJ
Author
First Published Oct 28, 2023, 3:28 AM IST

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా  మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మరోసారి మంత్రి హరీశ్ పైన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. నిజాం పేట మండలం కల్వకుంట్లలో తన కొడుకు కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ తో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి హరీష్ రావును జైల్ కు పంపుతామని  అన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మంత్రి హరీష్ రావు కోట్ల రూపాయలు కమీషన్ తీసుకొని, నాసిరకంగా ప్రాజెక్ట్ లను నిర్మాణం చేశారని ఆరోపించారు. అలా నాణ్యత లేకుండా నిర్మించడం వల్లే నేడు కూలిపోతున్నాయని అన్నారు. ఈ ఎన్నిలలో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే మంత్రి హరీష్ రావును జైల్ కు పంపుతుందని మైనంపల్లి హెచ్చరించారు.  

పోచారంలో ఉన్న జింకలతో పాటు జిల్లా కేంద్రంలో ఉన్న 14 ప్రభుత్వ కార్యాలయాలు సిద్దిపేట కు తరలిపోయాయని , బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, డబుల్ దళిత బంధు, బీసీ బంధు ఇల్లు పేరిట మోసం చేశాయని, అర్హులకు లబ్ది చేకూరలేదని ఆరోపించారు. తన కొడుకు రోహిత్ ను ఆశీర్వదించాలని, తన చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ఇప్పటి వరకు తాను రూ. 100 కోట్లు సేవ కోసమే ఖర్చు చేసినట్టు చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios