Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సభలో తీవ్ర విషాదం.. ఎమ్మెల్యే కారు ఢీ .. హోంగార్డు మృతి..

బీఆర్ఎస్ నిర్వహించిన ‘ఛలో నల్లగొండ’ సభ .. ఓ కుటుంబంలో విషాదం నింపింది. సభ నుంచి తిరిగి వస్తుండగా.. ఓ ఎమ్మెల్యే కారు అదుపుతప్పి అక్కడే ఉన్న హోంగార్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో హోంగార్డుకు గాయాలు కావడంలో తోటి సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు.  

MLA Lasya Nanditha Car incident Telangana Home Guard dies in road accident KRJ
Author
First Published Feb 13, 2024, 10:41 PM IST | Last Updated Feb 13, 2024, 10:41 PM IST

నల్గొండ వేదికగా బీఆర్‌ఎస్‌ నిర్వహించిన ‘ఛలో నల్లగొండ’ సభ.. ఓ కుటుంబంలో విషాదం నింపింది. సభ నుంచి తిరిగి వస్తుండగా.. ఓ ఎమ్మెల్యే కారు అదుపుతప్పి అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో హోంగార్డుకు గాయాలు కావడంలో తోటి సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకెళ్లే.. బీఆర్ఎస్ ‘ఛలో నల్లగొండ’ సభకు పెద్ద ఎత్తున వాహనాలు తరలివచ్చాయి.  ఈ క్రమంలో  పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున హోంగార్డులను గస్తీగా పెట్టారు. ఈ క్రమంలోనే చర్లపల్లి వద్ద ఎమ్మెల్యే కారు అదుపుతప్పింది. అక్కడ  విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కిషోర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆ హోంగార్డు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తోటి సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు.  

ఇదిలాఉండగా.. కేసీఆర్‌ సభ అనంతరం.. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత హైదరాబాద్ కు తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మర్గమధ్యలో నార్కట్‌పల్లి సమీపంలో చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొంది. దీంతో ఆమె కారు ముందు భాగం ధ్వంసం అయ్యింది. ఈ ఘటన జరిగిన అనంతరం.. ‘ నేను సురక్షితంగా ఉన్నాను.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని’ ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios