బోనమెత్తిన మిథాలీరాజ్.. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు..
హైదరాబాద్‌లో ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం సహా ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఈనేపథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ లాల్ దర్వాజ బోనాల ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం సహా ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే పండుగలో పలువురు సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. దర్వాజ అమ్మోరుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఈనేపథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ లాల్ దర్వాజ బోనాల ఉత్సవాల్లో సందడి చేశారు. అమ్మవారికి బోనం సమర్పించి తన మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మిథాలీ లాల్ దర్వాజ బోనాల జాతరకు రావడం ఇదే మొదటిసారి అన్నారు. 115 ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు.
బోనాల పండుగ చివరి రోజు సందర్భంగా లాల్ దర్వాజ ఆలయానికి ప్రముఖులు తరలివస్తున్నారు. బీఆర్ఎస్ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఆలయానికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే బీజేపీ నేతలు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ తదితరులు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.