ఐదు రోజుల క్రితం ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు నగరమంతా జల్లెడ పట్టారు. ఆ బాలుడు ఢిల్లీలో ఉన్నాడని తెలిసి వెళ్లి తీసుకువచ్చారు. అయితే ఇక్కడో ఓ ట్విస్ట్ వారిని తొలిచేస్తుంది.. అలా ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది...
హైదరాబాద్ : ఆరేళ్ల బాలుడు అనూహ్యంగా ఐదు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు కంగారుపడి అన్నిచోట్లా వెతుకుతుండగా ఉన్నట్లుండి delhiలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో హబీబ్ నగర్ ఠాణా సిబ్బంది హుటాహుటిన విమానంలో వెళ్లి బాలుని తీసుకువచ్చి సోమవారం సాయంత్రం అప్పగించారు. mallepalliలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి…
హబీబ్ నగర్ ఇన్ స్పెక్టర్ నరేందర్ కథనం ప్రకారం.. మల్లేపల్లి బడీ మసీదు ప్రాంతంలో ఉంటున్న కారు డ్రైవర్ హనీఫ్ కుమారుడు అయాన్ ఈ నెల 17న తప్పిపోయాడు. పోలీసులు మూడు కమిషనరేట్ల పరిధుల్లో గాలిస్తున్నారు. అదే సమయంలో బాలుడి వివరాలు ట్విటర్, ఫేస్ బుక్ లలో పోస్ట్ చేయగా.. వాటిని చూసిన ఢిల్లీలోని నిజాముద్దీన్ పోలీసులు ఆదివారం సమాచారం ఇచ్చారు.
సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో..
అయాన్ ను తీసుకువచ్చేందుకు అదనపు ఇన్స్పెక్టర్ నరసింహా, బాలుడి తండ్రి హనీఫ్ లు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. నిజాముద్దీన్ ఠాణాలో ఉన్న బాలుడుని తీసుకుని నగరానికి సోమవారం వచ్చారు. ఈనెల 19న ఒక అపరిచిత వ్యక్తి ఠాణాకు వచ్చి తన ఆధార్, ఇతర వివరాలు నమోదు చేసి అయాన్ ను అప్పగించి వెళ్లాడని నిజాముద్దీన్ పోలీసులు తెలిపారు. మల్లేపల్లి లో ఉన్న బాలుడిని ఆ వ్యక్తే చేరదీసి రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లాడని పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. కిడ్నాప్ చేసిన వ్యక్తి రైల్లో ఎందుకు తీసుకెళ్లాడు? ఎందుకు ఢిల్లీ పోలీసులకు అప్పజెప్పాడు అన్నది అంతుచిక్కడం లేదు. కిడ్నాప్ చేసి ఉంటే ఆధార్ కార్డు, వివరాలు పోలీసులకు ఎందుకు ఇచ్చాడు అని ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో ఢిల్లీలో కిడ్నాప్ అయిన బాలుడి కథ విషాదాంతం అయ్యింది. కనిపించకుండా పోయిన తొమ్మిదేళ్ల బాలుడు శవమై దొరికాడు. కొద్ది రోజుల క్రితం ఇంటినుంచి కనిపించకుండా పోయిన చిన్నారి.. ద్వారక లోని తన నివాస ప్రాంతానికి దగ్గర్లో ఓ ప్లాస్టిక్ కవర్ లో కుక్కి అతని మృతదేహం దొరికింది. బాలుడి తల్లిదండ్రులు ఉత్తమ్ నగర్ లో ఉంటారు. సోమవారం నాడు ఇంట్లో నుంచి ఒక్కసారిగా బాలుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.
ఈ క్రమంలో గాలింపు చేపట్టిన పోలీసులకు వాళ్లింటికి కాస్త దూరంలోని మరో ఇంట్లో చిన్నారి మృతదేహం లభించింది. dead body మెడ మీడ, శరీరంలో పలుచోట్ల గాయాలున్నాయి. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ.. మృతదేహాన్ని రికవరీ చేసే సమయంలో శరీరంలో పలు గాయాలున్నట్టు గుర్తించామని తెలిపారు.
ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న కొంతమందిని ఇప్పటికే పోలీసులు విచారించారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహం లభ్యం కావడంతో kidnap case ను murderకేసు గా రిజిస్టర్ చేశామని, మృతదేహాన్ని autopsy కోసం పంపామని, ఆ నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
మృతదేహం దొరికిన ప్రాంతాన్ని క్రైం టీం పర్యవేక్షించిందని, చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తుందని పోలీసులు తెలిపారు. బాలుడు కిడ్నాప్ అయిన దగ్గరి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో, బాలుడ్ని ఎవరు హత్య చేశారో తెలుసుకోవడానికి.. తద్వారా నిందితులను త్వరితగతిన పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో చిన్నారిని చంపిన తరువాత plastic bagలో కుక్కి, ఇంట్లో పడేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు
