బంధువుల ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటున్న ఓ బాలిక ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. బాలిక కనిపించడం లేదంటూ ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తీరా చూస్తే... మెడలో తాళిబొట్టుతో బాలిక ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది.

Also Read వివాహిత ఆత్మహత్య... పోలీసుల కళ్లల్లో కారం చల్లి.....

పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన ఓ బాలిక మూడుచెక్కలపల్లె గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటోంది. కాగా... మూడు రోజుల క్రితం బాలిక బంధువుల ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటోంది. అసలు బాలికను ఆమె తల్లిదండ్రులు పాఠశాల హాస్టల్ లోనే చేర్పించారు. అయితే.. బాలిక మాత్రం బంధువుల ఇంట్లో ఉంటూ డే స్కాలర్ గా స్కూల్ కి వచ్చేది.

ఉన్నట్టుండి సడెన్ గా బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో వెంటనే బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే... తాజాగా బాలిక పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తాను ప్రేమించిన యువకుడితోనే బాలిక పరారైనట్లు పోలీసులు గుర్తించారు.

మెడలో తాళి, నదుటున బొట్టుతో.. ప్రియుడితో కలిసి ఫోటోలు దిగి బాలిక సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం గమనార్హం. ఆ ఫోటోలను చూసిన బాలిక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కాగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.