రామంతపూర్‌లో అదృశ్యమైన బాలిక అనూష చెరువులో శవమై తేలింది. తల్లి మందలించడంతోనే ఆమె చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

హైదరాబాద్ రామంతపూర్‌లో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతమైంది. బాలిక అనూష మృతదేహాన్ని పోలీసులు స్థానిక చిన్న చెరువులో గుర్తించారు. తల్లి మరణించడంతో అనూష తీవ్రమనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆమె చిన్నచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ అనూష పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె మరణవార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred