ప్రేమ పేరుతో నమ్మించి, మైనర్ మీద పలుమార్లు అత్యాచారం.. అక్రమంగా అబార్షన్.. సహకరించిన తల్లి, సోదరి...

వరంగల్ లో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమపేరుతో వంచించాడు. పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఆ తరువాత అక్రమంగా అబార్షన్ చేయించాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో.... 

Minor girl raped and forced to illegally terminate pregnancy in Warangal

వరంగల్ : Warangalలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, అత్యాచారం చేసి.. గర్బం దాల్చడంతో తల్లి, సోదరి సాయంతో అక్రమంగా తొలగించిన ఘటన వరంగల్ బాలాజీనగర్‌లో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. నిందితుడిని కక్కెర్ల ఆకాష్‌గా గుర్తించారు. అతను బాలాజీనగర్‌లో నివసిస్తున్న మైనర్‌ను ప్రేమ పేరుతో నమ్మించి ట్రాప్‌ చేశాడు. ఒకరోజు తన పుట్టినరోజు అంటూ.. ఆకాష్ ఆ అమ్మాయిని ఇంటికి పిలిచాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంటికి వచ్చిన బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత కూడా పలుమార్లు ఆకాష్ మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలియగానే ఆకాష్ తన తల్లి, సోదరి సహాయం తీసుకుని స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంలోని రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ను ఆశ్రయించాడు. అక్కడ రెండు నెలల క్రితం అక్రమంగా అబార్షన్ చేయించాడు. అయితే అబార్షన్ చేయించేవరకు కూడా మైనర్ బాలికపై ఆకాష్ అత్యాచారం కొనసాగించాడు. 

ఇటు అత్యాచారం చేయడం, అటు అబార్షన్ లతో బాలిక చాలా బలహీనంగా మారింది. ఇది గమనించిన బాలిక తల్లి ఏమయిందని బాలికను నిలదీసింది. అప్పటివరకు తల్లికి విషయం చెప్పని బాలిక అప్పుడు నోరు విప్పింది. తన మీద జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకొచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ కె. గిరి కుమార్ ఆకాష్, అతని తల్లి, సోదరిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మైనర్ బాలికకు చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించినందుకు స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఆర్‌ఎంపీని కూడా పోలీసులు పట్టుకున్నారు.

యువతి హాఠాన్మరణం, 45 రోజుల తరువాత పోస్టుమార్టం.. ఏం జరిగిందంటే...

ఇదిలా ఉండగా, తైవాన్ లోని 51 యేళ్ల హువాంగ్ కేకే అనే మహిళ తన ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో కాహ్ సియుంగ్ లో ఉన్న బహుళ అంతస్తుల భవనానికి నిప్పు అంటించింది. దీంతో సుమారు 46 మంది మృతి చెందగా.. దాదాపు 41 మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆమెపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడిందని, పైగా, ఆమెలో పశ్చాత్తాపం కూడా లేదంటూ ఉరితీయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.

అయితే కోర్టు.. విచారణలో ఆమెను దోషిగా నిర్ధారించింది. కానీ, భవనంలో నివాసితులకు నష్టం కలిగించే ఉద్దేశం ఆమెకు లేదని పేర్కొంది. అంతేకాదు ఆమె ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ లేదని కూడా స్పష్టం చేసింది. ప్రియుడు మోసం చేయడంతో.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఆవేశంతో.. సదరు వ్యక్తిని ఇబ్బందులకు గురి చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొంది. పైగా దీన్ని ఉద్రేకపూరితమైన చర్యగా భావించిన.. కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. అయితే ఆమె తన నేరాన్ని కోర్టులో ఒప్పుకుంది. కానీ ఈ ఘటనకు పాల్పడే ముందు అసలు ఏం జరిగింది అనేది అస్పష్టంగా ఉంది. ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన న్యాయవాదులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్తామని తేల్చి చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios