Asianet News TeluguAsianet News Telugu

యువతి హాఠాన్మరణం, 45 రోజుల తరువాత పోస్టుమార్టం.. ఏం జరిగిందంటే...

మిర్యాలగూడలో ఓ యువతి మృతి.. 45 రోజుల తరువాత అనుమానాస్పదంగా మారింది. దీంతో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 

woman dies due to lover harassment for money in miryalaguda
Author
Hyderabad, First Published Aug 6, 2022, 10:11 AM IST

మిర్యాలగూడ : మిర్యాలగూడలో ఓ యువతి 45 రోజుల క్రితం హఠాత్తుగా చనిపోయింది. అయితే ఆమె మృతి ఇప్పుడు మిస్టరీగా మారింది... ఆమె అతడిని గుడ్డిగా నమ్మిందా?  దీంతో అతడు ఆమెను వంచించాడా? ఆమెతో చనువుగా పెంచుకొని ఆమెను వేధించి జీతం డబ్బులు, లోను డబ్బులు తీసుకుని ఒత్తిడికి గురి చేశాడా? దీంతోనే ఆమె మృతి చెందిందా? మృతురాలి తండ్రి ఆరోపణల ప్రకారం ఇదే అనిపిస్తుంది. చనిపోయిన 45 రోజుల తర్వాత ఆమె ఫోన్ ను పరిశీలించిన కుటుంబ సభ్యులు..  అందులో ఆ వ్యక్తి తో తన కూతురు ఉన్న ఫోటోలు, అతడికి ఇచ్చిన డబ్బు వివరాలు ఉండడంతో కంగుతిన్నారు. డబ్బుల కోసం వేధించడంతో తన కూతురు చనిపోయిందని ఆరోపిస్తూ యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు కననం చేసిన ఆమె మృతదేహాన్ని 45 రోజుల తర్వాత బయటికి తీయించి పోస్టుమార్టం చేయించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. మిర్యాలగూడ బాపూజీ నగర్ కు చెందిన గోన శ్రీనివాసరావు, యాదమ్మ దంపతులు కూలీపని చేసుకుంటారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రవళిక  బీటెక్ పూర్తి చేసి స్థానికంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. జూన్ 19న తల్లి, చెల్లి, మేనమామ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం,  మద్దిమడుగు క్షేత్రాల దర్శనానికి వెళ్ళింది.

దర్శనం తర్వాత మరుసటి రోజు మేనమామ స్వగ్రామం చందంపేట మండలం వెలమ గూడెం గ్రామానికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి ప్రవళిక గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పింది. దీంతో ఆమెను దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. అప్పటి వరకు బాగానే ఉన్న కూతురు ఒక్కసారిగా చనిపోవడంతో తల్లిదండ్రులు తేరుకోలేకపోయారు.  మృతదేహాన్ని స్వగ్రామమైన మిర్యాలగూడకు తీసుకువచ్చి స్మశానవాటికలో పూడ్చిపెట్టారు. ఇరవై రోజుల క్రితం ప్రవళిక వాడిన ఫోన్ ను ఆమె సోదరి చూసింది.

ప్రియుడి మోసం.. భవనానికి నిప్పుపెట్టి 46మంది ప్రాణాలు తీసిన ప్రియురాలు..కోర్టు ఏమందంటే...

ఆ ఫోన్ లో అదే కాలనీకి చెందిన పందిరి మహేష్ అనే యువకుడితో ప్రవళిక చనువుగా మెలిగినట్లు, ఎక్కువసార్లు మాట్లాడినట్లు, చాటింగ్ చేసినట్టు.. అతడి బ్యాంక్ ఖాతాకు ప్రవళిక అనేకసార్లు ఫోన్ పే ద్వారా వేలల్లో నగదును బదిలీ చేసినట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే మిర్యాలగూడ ఎస్బిఐ సిబ్బంది యువతి నెంబర్ కు ఫోన్ చేసి ప్రవళిక రుణంగా తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలని చెప్పారు. దీంతో రూ.50 వేల వరకు లోన్ తీసుకున్నట్లు తల్లి దండ్రులకు తెలిసింది. నెలవారీ జీతం డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా బ్యాంకులో దాచా.. అని గతంలో చెప్పడం.. ఆ నగదును ఆమె మహేష్ ఖాతాలకు బదిలీ చేసినట్లు తేలడంతో తల్లిదండ్రులకు అనుమానం మొదలైంది.

కూతురితో ప్రేమ నటించి డబ్బుల కోసం వేధించి ఆమె మృతికి కారణమయ్యాడని మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె చందంపేటలో మృతి చెందడంతో అక్కడ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు ఈ నెల 2వ తేదీన పోలీసులకు తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదుచేశారు. మిర్యాలగూడ తహసిల్దార్ అనిల్ కుమార్, ఆర్ఐ శ్యామ్, చందంపేట ఎస్ఐ యాదయ్య, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి వైద్యులు శంకర్ నాయక్, సద్గుణ రాజుల సమక్షంలో 45 రోజుల క్రితం మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. యువతి శరీరభాగాల నమూనాలు కొన్నింటిని సేకరించి వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios