ఆరేళ్ల చిన్నారికి కేకు ఆశచూపి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని పాల్వంచలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని గట్టాయిగూడేనికి చెందిన కడాలి శ్రీనాథ్‌ తాను పనిచేసే బేకరికి దగ్గర్లో ఆడుకోవడానికి వచ్చిన ఓ బాలికకు కేకు ఆశ జూపి దగ్గరకు తీసుకుని అత్యాచారానికి యత్నించాడు. చిన్న పిల్ల అనే జాలి కూడా లేకుండా దారుణానికి పాల్పడ్డాడు. 

దీంతో బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి శ్రీనాథ్‌కు దేహశుద్ధి చేశారు. అయితే బాలిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గురువారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు శ్రీనాథ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జె.ప్రవీణ్‌ తెలిపారు.