Asianet News TeluguAsianet News Telugu

అమీన్‌పూర్‌ మైనర్ బాలిక మృతిపై పోస్టుమార్టం నివేదిక:మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూరే కారణం

హైద్రాబాద్ కు సమీపంలోని అమీన్ పూర్ లోని ఓ అనాధాశ్రమంలో ఉండే మైనర్ బాలిక అనుమానాస్పద మృతిపై పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెలుగు చూశాయి.మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగానే మైనర్ బాలిక మరణించినట్టుగా పోస్టుమార్టం నివేదిక తేల్చి చెప్పింది.
 

minor girl dies due to multiple organ failure says postmortem report
Author
Hyderabad, First Published Sep 2, 2020, 3:19 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్ కు సమీపంలోని అమీన్ పూర్ లోని ఓ అనాధాశ్రమంలో ఉండే మైనర్ బాలిక అనుమానాస్పద మృతిపై పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెలుగు చూశాయి.మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగానే మైనర్ బాలిక మరణించినట్టుగా పోస్టుమార్టం నివేదిక తేల్చి చెప్పింది.

అమీన్ పూర్ లోని మారుతి అనాధాశ్రమంలో ఉంటున్న అనాధ బాలికపై వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధిత బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

also read:అమీన్‌పూర్ మైనర్ బాలిక మృతి కేసులో ట్విస్ట్: బాలిక బంధువులపై కేసు, సమగ్ర విచారణకు ఆదేశం

బాలికకు చెందిన పోస్టుమార్టం నివేదిక పోలీసులకు చేరింది. బాలిక మృతిపై హైలెవల్ కమిటీ విచారణ సాగిస్తోంది. హైలెవల్ కమిటీతో పాటు పోలీసులు కూడ మృతురాలి కుటుంబసభ్యుల నుండి స్టేట్ మెంట్ తీసుకొన్నారు.మరో వైపు ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. 

ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయనున్నారు. ఛార్జీషీట్ దాఖలు చేయడం కోసం ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios