హైదరాబాద్:హైద్రాబాద్ కు సమీపంలోని అమీన్ పూర్ లో అనాధాశ్రమంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక మరణించిన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. మైనర్ బాలిక బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అమీన్ పూర్ లోని ఓ అనాధాశ్రమంలో బాలికకు మత్తు మంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టుగా బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో బాలిక మరణించింది.

అయితే బాలిక బంధువు అనిల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను ఆశ్రమం నుండి తీసుకొచ్చి  అనిల్, కీర్తన ఇంట్లో రెండు మాసాలు ఉంచారు. ఆ తర్వాత కీర్తన సోదరి ఇంట్లో కూడ ఆ బాలిక ఉంది.

ఆశ్రమం నుండి వచ్చిన బాలిక తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టుగా  అనిల్, కీర్తన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు చెప్పారు. మైనర్ బాలిక కీర్తన ఇంట్లో ఉన్న సమయంలో కూర్చొన్న చోటే మలమూత్రాలు విసర్జించేదని కీర్తన చెప్పింది. 

ఈ విషయమై తానే ఆమెను కొట్టినట్టుగా చెప్పారు. ఈ విషయమై తన భర్త అనిల్ పై పోలీసులు కేసు నమోదు చేయడంపై కీర్తన ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును నీరుగార్చేందుకే తమపై కేసు పెట్టారని మైనర్ బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. 

also read:మత్తు పానీయం ఇచ్చి అనాథాశ్రమంలో దాత రేప్: బాలిక మృతి

మరో వైపు అనాధశ్రమంలో ఉన్న బాలికపై అత్యాచారం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. హైపవర్ కమిటీ ఈ ఘటనపై విచారణ చేయనుంది.బాలల హక్కుల కమిషన్ అపర్ణ, చైల్డ్ వేల్పేర్ డిపార్ట్ మెంట్ నుండి అన్నపూర్ణ, ఏసీపీ ప్రతాప్, సునందలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

హైపవర్ కమిటీ సభ్యులు మైనర్ బాలిక బంధువులను కలిసి విచారించనున్నారు. ఈ ఘటనలో ఏం జరిగిందనే విషయమై బాలిక బంధువులను ప్రశ్నించనున్నారు.